ఇలా చేస్తే జలుబు, ముక్కు దిబ్బడ మాయం ఇంకోసారి రాదు కూడా

Loading...
ముక్కు దిబ్బడ జలుబు అనేవి మనిషిని ఆమాంతం క్రుంగతీస్తాయ్ అంటే ఒక్క ౩ రోజులకే నీరసంగా అయిపోతాడు, మరి అలంటి జలుబుకి ఉపశమనం ఎలాగా?
చికెన్ సూప్ లేదా వెజ్టేబుల్ సూప్
మనం జలుబు రాగానే టాబ్లెట్ లేదా ఇంహేల్లర్(ముక్కులో పెట్టి పిల్చుకునేది) వాడతాము. దీని వల్ల ఒక కొంతసేపు మాత్రమే ఉపశమనం ఉంటుంది. అలా కాకుండా శరీరంలో వైరస్ పోవాలంటే వేడి వేడి సూప్ చాలా మంచిది. మాంసం తినేవాళ్ళు అయితే చికెన్ సూప్ తాగగానే వెంటనే రిలీఫ్ వస్తుంది. శాఖాహారం తినేవాళ్ళు కొంచెం కారంగా మరియు వేడిగా ఉండే టమాటో లేదా వెజ్టేబుల్ సూప్ త్రాగితే జలుబు వెంటనే తగ్గుతుంది.
వేడి నీటితో స్నానం లేదా తులసి వేసిన నీటితో
చాలా మంది జలుబు చేసినప్పుడు స్నానం చెయ్యకుండా అలసటతో ఉంటారు ఇలా చెయ్యడం కన్నా వేడి నీటితో స్నానం చేస్తే లోపల ఉన్న జలుబు ఖఫం మొత్తం పోతుంది. ఒకవేళ స్నానం చేసే ఓపిక లేకపోతే వేడి నీటి ఆవిరి పడితే అద్బుతమైన ఉపశమనం కలుగుతుంది.
రాత్రి పూట పడుకునేముందు
పడుకునేటప్పుడు ఒక దిండుని ఎక్కువగా పెట్టుకోండి అంటే ఒకటి బదులు రెండు దిండులను పెట్టుకుంటే ముక్కు దిబ్బడ తగ్గి తేలికగా నిద్ర పడుతుంది
లెమన్ టీ లేదా గ్రీన్ టీ
జలుబు చేసినప్పుడు వేడి వేడిగా ఉండే టీ కాఫీ లు త్రాగాచ్చు, అయితే కాఫీ కన్నా టీ చాలా మేలు మరి జలుబు తగ్గడానికి అయితే గ్రీన్ టీ లేదా లెమన్ టీ వేడిగా త్రాగితే ముక్కు దిబ్బడ తగ్గి హాయిగా ఉంటుంది.
ఉప్పు నీటితో
కొద్దిగా వెచ్చని నీరు తీసుకుని ఉప్పు వేసి పుక్కిలిస్తే జలుబు వల్ల వచ్చే గొంతు సమస్యలు రావు.
Loading...

Popular Posts