మొటిమలు చాలా ఎక్కువగా వస్తున్నాయని చిరాకు పడుతున్నారా ? మొటిమలు వల్ల ఎంత లాభమో తెలుసా?

Loading...
మొటిమలు చాలా ఎక్కువగా వస్తున్నాయని చిరాకు పడుతున్నారా? మరేం పర్వాలేదు.. మీకు వృద్ధాప్యం అంత త్వరగా రాదనేందుకు అవి సంకేతం! మొటిమలు ఎక్కువగా వచ్చేవారి చర్మం త్వరగా ముడతలు పడదని, పలుచబడి సాగిపోదని, ఫలితంగా వృద్ధాప్య లక్షణాలు త్వరగా రావని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు.. ఎక్కువ కాలం జీవిస్తారనేందుకు కూడా మొటిమలను సంకేతంగా భావించవచ్చని వారు చెబుతున్నారు. తెల్లరక్తకణాల్లోని టీలోమీర్ల పొడవుతో సంబంధం ఉన్న ఓ జన్యువు.. మొటిమలకు కూడా కారణం అవుతోందని కింగ్స్‌ కాలేజ్‌ పరిశోధకులు గుర్తించారు.
Loading...

Popular Posts