ఇంట్లో డబ్బులు ఎక్కడ దాచిపెడితే.. అత్యంత ధనవంతులవుతారు ? డబ్బులను దాచిపెట్టేటప్పుడు ఈ నియమాలు పాటించాలి

Loading...
డబ్బు, నగలు, ఆస్తి అంటే.. మనందరికీ చాలా ఇష్టం, వ్యామోహం. అది అవసరం కూడా. ఎందుకంటే.. డబ్బు లేనిది.. ఏ చిన్న వస్తువు కొనలేం, ఏ చిన్న పని జరగదు. కాబట్టి.. ఎంతో కొంత డబ్బునైనా.. దాచిపెట్టుకోవాలని, పొదుపు చేసుకోవాలని భావిస్తుంటాం. కానీ చాలామంది డబ్బును ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పెట్టేస్తుంటారు. లాకర్స్ లో కాకుండా.. గాబరాగా.. వంటింట్లో, పోపులడబ్బాలో, అలమరాల్లో, బట్టల కింద, పాత పర్స్ లలో ఇలా ఎక్కడ వీలైతే అక్కడ దాచిపెట్టేస్తుంటారు. కానీ.. ఇది ఏమాత్రం మంచిది కాదట. డబ్బులను దాచిపెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. 

మనందరికి ఎంతో కొంత డబ్బు సేవింగ్స్ లో ఉంటాయి. అవి రాత్రికి రాత్రే రెట్టింపు అవ్వాలని కూడా కోరుకుంటాం. అయితే.. మన డబ్బులను కొన్ని విభిన్నమైన ప్లేస్ లలో, కొన్ని వాస్తు నియమాలు పాటిస్తూ పెట్టుకోవడం వల్ల.. చాలా త్వరగా ధనవంతులవుతారట. డబ్బును దాచిపెట్టేటప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. త్వరలోనే సంపన్నులవుతారట. 
  • తూర్పు దిశలో మీ ఇంటికి తూర్పు దిశలో డబ్బుని, లాకర్ నిపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల.. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
  • పడమట దిశలో పడమర వైపుగా.. నగలు, పూర్వీకులకు సంబంధించిన వస్తువులు, నగలు పెట్టుకోవాలి.
  • ఉత్తరం వైపుగా ఉత్తరం వైపుగా తెరిచేలా ఉండే అలమరాలలో నగలు, డబ్బును ఖచ్చితంగా పెట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల.. మీకు డబ్బు కొరత అనేది ఎప్పటికీ రాదు.
  • దక్షిణం వైపు మీ ఇంటికి దక్షిణంవైపుగా నగలు, డబ్బును పెట్టుకోవడం వల్ల.. నెగటివ్ ఎఫెక్ట్ ఉండదు. అలాగని పాజిటివ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. కాబట్టి.. ఈ డైరెక్షన్ లో పెట్టుకోకపోవడం మంచిది.
  • మెట్లు మెట్ల కిందగానీ, బాత్ రూం ఎదురుగా కానీ.. లాకర్ ని ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు. అలాగే లాకర్ లో ఎక్కువ దుమ్ము, డస్ట్ ఉందంటే.. నెగటివిటీకి దారితీస్తుంది.
  • లక్ష్మీ ఫోటో లాకర్ లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవాలి. అది కూడా.. రెండు ఏనుగులు తొండం పైకి ఎత్తి చూపుతున్నట్టు ఉండే లక్ష్మీ ఫోటోనే లాకర్ లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఫైనాన్స్ పెరుగుతుంది.
  • ఆగ్నేయం ఇంటిలోపల.. సంపద, డబ్బు, శ్రేయస్సు, సమృద్ధిని సూచించే వస్తువులను లివింగ్ రూంలో ఆగ్నేయంలో పెట్టుకోవాలి.
  • డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ ని ఎటు వైపుగా, ఎక్కడ పెట్టుకున్నా ఫర్వాలేదు. కానీ.. డనింగ్ టేబుల్ పై అద్ధం రిఫ్లెక్స్ అయ్యేలా ఉండాలి. ఇలా చేయడం వల్ల.. మీ కుటుంబానికి ఎప్పటికీ ఆహారం కొరత రాదు.
  • ఫ్రెష్ ఫ్రూట్స్ హెల్తీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉన్న ఫోటోని డైనింగ్ రూంలో అతికించాలి. ఇది.. ఆకలిని పెంచుతుంది. మీకు, మీకు కుటుంబానికి కావాల్సినంత ఆహారం లభిస్తుంది.
Loading...

Popular Posts