పంటి నొప్పిని ఇంట్లోనే తగ్గించుకునే మార్గం.. ఈ సింపుల్ టెక్నిక్ తో పంటి నొప్పి సెకండ్స్ లో మాయం.

Loading...
పంటి నొప్పిని ఇంట్లోనే సహజ మార్గాల ద్వారా తగ్గించుకునే మార్గం ఉంటే.. హ్యాపీనే కదా. ఇంతకూ పంటి నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?
పంటి చిగుర్లో తలెత్తే సమస్యల వల్ల పంటి నొప్పి వస్తుంది. సున్నితమైన అనేక నరాలు చిగుర్లో ముగుస్తాయి. కాబట్టి చిగుర్లో వచ్చే ఇరిటేషన్ కారణంగా పంటి నొప్పి వస్తుంది. ఇలా నొప్పి వచ్చినప్పుడు కొందరు పెయిన్ కిల్లర్లను వేసుకుంటారు. వీటిలో ఉండే బెంజోకైన్ శక్తివంతమైన మత్తుమందుగా ఉపయోగపడుతుంది. కానీ వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్‌లు తలెత్తుతాయి.
  • అయితే లవంగాల ద్వారా పంటి నొప్పిని తగ్గించుకోవచ్చు. పెయిన్ కిల్లర్లలో ఉండే బెంజైకోన్ వీటిలో కూడా ఉంటుంది. కానీ ఇవి ప్రకృతి సిద్ధంగా లభించిన కారణంగా వీటి వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. 
  • పంటి నొప్పి వస్తున్న భాగంలో రెండు నిమిషాలపాటు లవంగాలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల వెంటనే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 
  • లవంగం నూనెను ఉపయోగించి కూడా పంటి నొప్పి తగ్గించుకోవచ్చు. ఇందు కోసం రెండు చుక్కల లవంగం నూనెను అర టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో కలపాలి. అందులో కాటన్‌ను ముంచి పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచాలి. నొప్పి తగ్గే దాకా ఈ విధంగా చేయాలి. అలాగనీ చాలా సేపు చేయడం మంచిదికాదు. 
  • మార్కెట్లో స్వచ్ఛమైన లవంగం నూనె లభించే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి లవంగాలనే వాడటం ఉత్తమం. లవంగాల్లో ఉండే మెగ్నీషియం దంతాలు, ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌గానూ పని చేస్తుంది
Loading...

Popular Posts