సీతాఫలంతో అద్బుత ప్రయోజనాలు.. దీర్ఘకాలిక వ్యాధులను కూడా అంతమొందించే శక్తి సీతాఫలానికి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే సీతాఫలం ఒక సంజీవని

Loading...
కాలానుగుణంగా ఉత్పత్తి అయ్యే పండ్లలో ఒక్కొక్క పండుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఏ పండు అయినా, శరీరానికి కేలరీలుతోపాటు తగిన మోతాదులో మాంసకృత్తులను సైతం అందించగలవు, అయితే సీతాఫలం మాత్రం ఇందుకు భిన్నమైనదనక తప్పదు. ఆహార పధార్థాంగా ఆకలిని తీర్చడం మాత్రమేగాక, ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలు ఇందులో దాగివున్నాయంటే ఆశ్ఛర్యం కలగక మానదు. సీతాఫలం ఆకు మొదలుకుని గుజ్జు తిన్న తరువాత పారవేసే గింజల వరకూ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని వైద్యశాస్త్రం నొక్కిచెపుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పండులోని ప్రతి భాగం ఔషధమని చెప్పక తప్పదు. దేహాపుష్టి పెంపు నుంచి కొన్ని రకాల ధీర్ఘకాలిక వ్యాధులను నశింపచేసే శక్తి సీతాఫలాంనికి ఉంది. రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే ఔషధ గుణగణాలు సీతాఫలంలో దాగి ఉన్నాయి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను కూడా అంతమొందించే శక్తి సీతాఫలానికి ఉంది. సీతాఫలం ఒక సంజీవని మాదిరిగా పని చేస్తుంది. 
 • 1. హృద్రోగులు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. డైటింగ్‌ నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు.
 • 2.ఈ ఫలంలో ఉండే విటమిన్-ఏ జుట్టు, కళ్లతో పాటు చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
 • 3. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.
 • 4. ఈ పండ్లలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయివున్న కొవ్వును కరిగించడంలో కీలకపాత్రను పోషిస్తాయి.
 • 5. పేగుల్లో ఉండే హెల్మింత్స్‌ అనే నులిపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పండు గుజ్జు అల్సర్లపై చక్కటి మందులాగా పనిచేసి ఉపశమనాన్నిస్తుంది. త్రిదోష నివారిణిగా శరీరంలో ఉండే వాత, పిత్త కఫ దోషాన్ని తగ్గించడంలో ప్యూరిఫైర్‌గా పనిచేస్తుంది.
 • 6. ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కడుపులో మంట, జీర్ణ సంబంధ సమస్యలున్నవారు ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే డైటింగ్‌ చేసేవారు ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.
 • 7. సీతాఫలంతో కొన్ని చిట్కాలు సీతాఫలంలోని గుజ్జును పాలతో కలిపి తాగితే శీరీరంలోని వేడి, అతి దాహం తగ్గుతాయి. జ్వరంగా ఉండి నాలు పిడచకట్టి ఒకటే దాహంగా ఉన్నప్పుడు సీతాఫలం గుజ్జును, పాలు కలిపిన మిశ్రమాన్ని ఇస్తే దాహ బాద తగ్గిపోతుంది.
 • 8. బలహీనంగా ఉన్నపిల్లలకు, బాలింతలకు సీతాఫలం గుజ్జను తేనెతో కలిపి ఇస్తే అది వాళ్లకు అధిక శక్తి చేకూరడానికి ఉపకరిస్తుంది. సీతాఫలాల గుజ్జును జ్యూస్ లా చేసి పటికి బెల్లం లేదా చక్కెర వేసి పాలతో కలిపి ఇస్తే పాలిచ్చే తల్లులకు, ఎదిగే పిల్లలకు మంచి ఆహారం.
 • 9. ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి, రెండు పండ్లు తినిపిస్తే మంచిది. బలవర్థకమే కాదు.. ఫాస్పరస్‌, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు.. ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి 
 • 10. తలలో చుండ్రు వున్నవారికి ఎండిన సీతాఫలం గింజను మెత్తగా పొడి కొట్టి, ప్రతిరోజు ఆ పొడిని షాంపులాగా ఉపయోగిస్తూ స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. మెదడుకు, నరాల వ్యవస్థకూ సీతాఫలం చాలా ఉపకరం అంటున్నారు.
 • 11. పండులోని సల్ఫర్‌ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది. సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుంది 
 • 12.సీతాఫలం పండు తింటే అజీర్తి మలబద్దకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. నరాలు, కండరాలు బలహీనత గలవారికి ఈ పండు మంచి ఫోషకాహారం. చర్మవ్యాధులు తగ్గిపోతాయి.
ఆస్తమా ఉన్నవారు తీసుకోరాదు..
ఆస్తమా ఉన్నవారు మాత్రం సీతాఫలంను తీసుకోకూడదు. మధుమేహం ఉన్నవారు తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే మామూలుగా పండిన పండును మాత్రం తింటే ఎలాంటి బాధా ఉండదు. అదే ఎక్కువగా పండిన పండును మాత్రం తిన్నట్లయితే అందులో గ్లూకోజ్‌ శాతం ఎక్కువగా ఉండి చక్కెర వ్యాధి గ్రస్తులకు ఎక్కువగా హాని చేస్తుంది. అలాగే లివర్‌ వ్యాధితో, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం ఈ సీతాఫలానికి దూరంగా ఉండాలి.
Loading...

Popular Posts