స్నానం చేసే నీటిలో ఒక స్పూన్ దీన్ని కలపండి చాలు ఎల్లప్పుడూ యంగ్ గా ఉంటారు.. సెలెబ్రిటీలు యంగ్ గా కనపడడానికి ప్రధానంగా ఇదే వాడతారు

స్నానానికి వేడి నీళ్లు రెడీ చేసుకున్నారా? అయితే అందులో ఒక స్పూన్  ఎప్సం సాల్ట్ ను(Epsom salt) వేసి ఓ రెండు నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. 

ఎప్సం సాల్ట్ లో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం అణువులు.. వేడి నీళ్లలో త్వరగా కరిగిపోతాయి. ఇలా కరిగిన మెగ్నీషియం ఐయాన్స్ శరీరంలోని కొన్ని ప్రాంతాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఎప్సం సాల్ట్ కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల అలసిన మీ దేహం ఒక్కసారిగా తేలికవుతుంది. కీళ్లనొప్పులు, నరాల బెణుకులు ఉంటే ఇట్టే తగ్గిపోతాయి.

చర్మంపై మృత కణాలను తొలగించి ఎల్లప్పుడూ చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. యంగ్ గా కనపడటానికి ఈ ఎప్సం సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది. మన సెలెబ్రిటీలు యంగ్ గా కనపడడానికి ప్రధానంగా ఇదే వాడతారు. దీని ఖరీదు కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది. క్వాలిటీ బట్టి ఒక కేజీ ఎప్సం సాల్ట్ సుమారు 300 - 500 రూపాయల వరకు ఉంటుంది. ఒక కేజీ నెలంతా సరిపోతుంది.
Loading...

Latest Posts