ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు

Loading...
జీవితంలో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే.. భవిష్యత్తులో మంచి మార్గానికి దారులు అని పెద్దలంటుంటారు. నిజమే.. ఇది ఆహారానికి వర్తిస్తుంది. ఇదే రోజువారీ తీసుకునే ఆహారంలోనూ వర్తిస్తుంది. ఆహారంలో కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆ చిన్న చిన్న జాగ్రత్తలేమిటంటే..

  • కూరగాయల సలాడ్‌తో మంచి ఆరోగ్యం సమకూరుతుందన్న విషయం తెలిసిందే. ఇటీవల క్యారెట్‌, టమాటా, చిన్న చిన్న ఉల్లి ముక్కలతో సలాడ్స్‌ చేసి తీసుకోవడం పెరిగింది. ప్రధాన భోజనం సమయంలోనూ, చిరుతిండిగా స్నాక్స్‌ తీసుకునే సమయంలో ముందుగా ఇలాంటి సలాడ్‌ తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
  • మనలోని ప్రతి జీవకణంలోనూ ప్రతి రోజూ జరిగే జీవక్రియల్లో కణానికి కొంత నష్టం జరుగుతుంది. దీన్నే సెల్‌ డ్యామేజ్‌ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్న ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల సెల్‌ డ్యామేజ్‌ తగ్గడమే కాకుండా, కణానికి తగిలే దెబ్బలను ఇవి రిపేర్‌ చేస్తాయి. మనం తీసుకునే ప్రధాన ఆహారానికి తోడుగా బాదం, క్యారెట్‌, టమాటాలను కలిపి తింటే మంచి ఆరోగ్యం సమకూరుతుంది. ఉదాహరణకు బ్రెడ్‌తో ఈ ముక్కలన్నింటినీ శాండ్‌విచ్‌లా కలిపి తినడం మంచిది.
  • బ్రేక్‌ఫాస్ట్‌ను వండే సమయం లేనప్పుడు పెసర్లు లాంటి పొట్టు తీయని గింజధాన్యాలను నానబెట్టి, ప్రతిరోజూ ఉదయం ఏదో ఒక పండుతో పాటు తిని, పాలు తాగడం టిఫిన్‌కు ఒక ప్రత్యామ్నాయం.
  • కొవ్వు తీసిన పాలతో తోడేసిన పెరుగును ఆహారం తర్వాత తీసుకోవడం మంచిది. ఈ పెరుగును చిలికి మజ్జిగ చేసుకుని అందులో కొద్దిగా మిరియాలపొడి, జీలకర్ర, అల్లం రసంతో కలుపుకుని బటర్‌మిల్క్‌ రూపంలో తాగడం వల్ల వంటికి చలువ చేస్తుంది.
  • రోజూ ఎక్కువసార్లు కూల్‌డ్రింక్స్‌్‌ లేదా ప్యాకింగ్‌ డ్రింక్స్‌ తాగేవారు దానికి బదులు ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల కూల్‌డ్రింక్స్‌ నుంచి కలిగే దుష్పరిణామాలను నివారించడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని ఏకకాలంలో పొందవచ్చు.

కాబట్టి, ఇలాంటి చిన్న చిట్కాలతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
Loading...

Popular Posts