కీళ్ళనొప్పులకు నిమ్మతొక్కలతో అద్భుతమైన పరిష్కారాలు

నిమ్మతొక్క విషయానికి వస్తే.. ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. చేదుగా ఉన్నప్పటికీ.. నిమ్మతొక్కలో సిట్రిక్ యాసిడ్, ఫోర్మిక్ యాసిడ్, సిట్రోనెల్లా, పెక్టిన్స్ వంటి పోషకాలు.. అనేక అనారోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. నిమ్మతొక్క యాంటీ ఇన్ల్ఫమేటరీగా కూడా పనిచేయడం వల్ల కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. మరి నిమ్మతొక్కను కీళ్ల నొప్పులు నివారించడానికి ఎలా ఉపయోగించాలో చూడండి.
  • కొన్ని నిమ్మ కాయలు తీసుకోని.. నిమ్మ తొక్కను మాత్రమే.. తురుము కోవాలి. కేవలం ఎల్లో కలర్ లో ఉన్న తొక్క మాత్రమే వచ్చేలా జాగ్రత్తపడాలి. ఇలా తురుముకున్న తొక్కను కీళ్ల నొప్పులు ఉన్న ప్రాంతంలో రాసుకుని.. బ్యాండేజ్ కట్టుకోవాలి. ఇలా 2 నుంచి 3 గంటలు అలాగే పెట్టుకుంటే.. కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. 
  • టీ రూపంలో నిమ్మతొక్కను తీసుకోవడం వల్ల కూడా.. కీళ్ల నొప్పులను ఎఫెక్టివ్ గా తగ్గించవచ్చు. కొన్ని నిమ్మతొక్కలను వేడినీటిలో ఉడికించాలి. కొన్ని నిమిషాలు ఉడికిన తర్వాత.. కొద్దిగా తేనె కలుపుకుని.. తాగాలి. అంతే.. ఇలా చేయడం వల్ల కూడా.. కీళ్ల నొప్పులు, వాపులు ఎఫెక్టివ్ గా తగ్గుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)