రాత్రి పడుకునేటప్పుడు నిమ్మకాయ ముక్కలని చక్రాల్లాగా కోసి మీ బెడ్ రూంలో ఎక్కడైనా సరే పెట్టి నిద్రించండి. అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు

  • నిమ్మకాయను కొన్ని ముక్కలుగా కట్ చేసి, ఒక కప్పులోకి తీసుకుని, దాని మీద కొద్దిగా ఉప్పును చిలకరించి పెట్టాలి. నిద్రించడానికి ముందు, ఈ నిమ్మ ముక్కలను పడకగదిలో ఎక్కడో ఒక చోటో మీరు పడుకోవడానికి దగ్గరలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నారా ? ఇలా చేయడం వల్ల అనేక బెనిఫిట్స్ ను పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
  • నిమ్మరసం నుండి వచ్చే వాసనలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసనాళ సమస్యల వల్ల నిద్ర సరిగా పట్టకపోతే, పడక గదిలో నిమ్మముక్కలు పెట్టడం వల్ల నాజల్ ఫ్రీ అవుతుంది. బాగా నిద్రపడుతుంది.
  • నిమ్మరసంలోని సువాసన స్ట్రెస్ తగ్గిస్తుంది, రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. నిద్రించడానికి ముందు బాడీ, మైండ్ ను రిలాక్స్ చేసి, బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది.
  • బెడ్ రూమ్ లో మీ నిద్రను పాడుచేస్తున్న ఈగలు, దోమలు, ఇతర కీటకాలను నివారించే శక్తిసామర్థ్యం నిమ్మరసంలో గ్రేట్ గా ఉంది. అందుకే నిమ్మకాయ ముక్కలను బెడ్ రూమ్ లో పెట్టుకోవడం వల్ల, దోమలు, కీటకాలతో ఎలాంటి అంతరాయం కలగకుండా నిద్రపోవచ్చు.
  • నిద్రలేమి సమస్యతో బాధపడే వారి మనస్సును రిలాక్స్ చేసి, త్వరగా నిద్రపట్టేట్లు చేస్తుంది. బెడ్ పక్కన ఒకటి రెండు నిమ్మకాయలు లేదా నిమ్మకాయ ముక్కలు పెట్టి పడుకోవడం వల్ల బాగా నిద్రపడుతుంది.
  • నిమ్మకాయ ముక్కలను పడుకునే ముందు పడకగదిలో ఉంచడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుందని, రీసెంట్ స్టడీలో నిర్ధారించారు.
  • ఫ్రెష్ గా నిద్రలేవడానికి సహాయపడుతుంది, నిమ్మకాయల నుండి వచ్చే ఆరోమా వాసన సెరెటినిన్ లెవల్స్ ను పెంచుతుంది, కాబట్టి పడక గదిలో వీటిని ఉంచుకోవడం వల్ల మరుసటి రోజు ఉదయం ఫ్రెష్ గా నిద్రలేస్తారు. రోజంతా ఉల్లాసంగా ఉంటారు.
  • నిమ్మకాయ ముక్కలను పడకగదిలో ఉంచడం వల్ల గదిలో గాలి రిఫ్రెష్ అవుతుంది. దాంతో మంచి నిద్రపడుతుంది. మెదడు, నాడీ వ్యవస్థకు ప్రశాంతంగా రిలాక్స్ అవుతాయి, దాంతో మంచి గాఢమైన నిద్రకు ఉపక్రమింపచేస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)