కేవలం 7 రోజుల్లో 3 కేజీలు తగ్గి.. స్లిమ్ గా, మంచి షేప్ లోకి మారిపోవచ్చు.. ఎఫెక్టివ్ ఫలితాలను ఇచ్చే.. డైట్ ప్లాన్

Loading...
 • అదనపు ఫ్యాట్, బరువు తగ్గడం అనేది ప్రస్తుత రోజుల్లో అతిపెద్ద టాస్క్ లా, టార్గెట్ లా మారింది. బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఏవి తినాలి ? ఏవి తినకూడదు ? ఎంత తింటున్నాం ? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకున్న సరైన డైట్ ప్లాన్ ఉండాలి. అప్పుడే.. మీ శరీరం సరైన షేప్ లోకి మారుతుంది. బరువు తగ్గే ప్రాసెస్ ని ఈజీగా మార్చుకోవాలి అంటే.. డైటీషియన్స్ చెప్పిన వెయిట్ లాస్ డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి. ప్రస్తుత రోజుల్లో జంక్ ఫుడ్ కి అలవాటు పడటం వల్ల.. బరువు తగ్గడం అనేది చాలా కష్టంగా మారింది. కానీ.. కేవలం 7 రోజుల్లో 3 కేజీలు తగ్గి.. స్లిమ్ గా, మంచి షేప్ లోకి మారిపోవచ్చు. మరి ఇంత ఎఫెక్టివ్ ఫలితాలను ఇచ్చే.. డైట్ ప్లాన్ ఎలా ఉందో చూడాలని ఉందా..
 • బ్రేక్ ఫాస్ట్ కి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల.. శరీరం డెటాక్స్ అవుతుంది.
 • బ్రేక్ ఫాస్ట్ ఒక బౌల్ ఓట్ మీల్ ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాలి. దాంతో పాటు ఒక గ్లాసు ఆరంజ్ జ్యూస్ లేదా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తీసుకోవాలి.
 • లంచ్ తృణధాన్యాలతో చేసిన చపాతీ, బ్రౌన్ రైస్, పప్పు, పెరుగు, గ్రీన్ వెజిటబుల్స్, సలాడ్స్ తీసుకోవాలి. అలాగే ఒక గ్లాసు మజ్జిగ లేదా కొత్తీమీర జ్యూస్ లేదా బీట్ రూట్ జ్యూస్ తీసుకోవాలి.
 • సాయంత్రం స్నాక్స్ ఫ్రై చేయని స్నాక్స్ లేదా ఫైబర్ బిస్కెట్స్ తీసుకోవాలి. దాంతో పాటు గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తీసుకోవచ్చు.
 • రాత్రి భోజనం పెరుగు, బ్రౌన్ రైస్, కందిపప్పు, పెరసరపప్పుతో చేసిన కిచిడి, తృణధాన్యాలతో చేసిన చపాతీ, పప్పు తీసుకోవాలి. దాంతో పాటు ఒక గ్లాసు నీటిలో టీస్పూన్ ధనియాల పొడి, చిటికెడు బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకోవాలి.
 • డైట్ డైట్ లో ఎక్కువ సలాడ్స్, సూప్స్, నట్స్, బీన్స్, ఇతర హై ప్రొటీన్ ఫుడ్స్ ని చేర్చుకోవాలి.
 • మంచినీళ్లు ప్రతి రోజు కనీసం 6నుంచి 8 గ్లాసుల నీళ్లు ఖచ్చితంగా తాగాలి. దీనివల్ల.. శరీరం నుంచి మలినాలు తొలగిపోతాయి.
 • తినకూడనివి జంక్ ఫుడ్, ఆయిల్, సాల్ట్, స్వీట్స్, బ్రెడ్ కి నో చెప్పాలి. ఇవి డైట్ లో చేర్చుకోకుండా జాగ్రత్త పడాలి.
 • ఆల్కహాల్ సిగరెట్స్, ఆల్కహాల్ కి ఎంత వీలైతే అంత దూరంగా ఉండటం మంచిది. అప్పుడే.. మీరు ఫాలో అవుతున్న డైట్ పర్ఫెక్ట్ ఫలితాలనిస్తుంది.
 • ఎక్సర్ సైజ్ రెగ్యులర్ ఎక్సర్ సైజ్, వాకింగ్, వర్క్ అవుట్స్ ని ఎట్టిపరిస్థితుల్లో మిస్ చేయకుండా.. రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి.
Loading...

Popular Posts