ఈ ప‌వ‌ర్ ఫుల్ టిప్స్‌ను పాటిస్తే కేవ‌లం 3 నెల‌ల్లోనే ఎలాంటి కీళ్ళ నొప్పులైనా ఇట్టే త‌గ్గిపోతాయి

కూర్చున్నా, నిలబ‌డ్డా, వంగినా… కీళ్లు, ఎముక‌ల నొప్పులు. క‌నీసం అడుగు తీసి అడుగు వేయాలంటేనే తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వ‌స్తుంది. అంత‌టి నొప్పి, బాధను క‌లిగిస్తాయి కీళ్లనొప్పులు. అయితే కింద ఇచ్చిన రెండు ప‌వ‌ర్ ఫుల్ ఎఫెక్టివ్ టిప్స్‌ను పాటిస్తే కేవ‌లం 3 నెల‌ల్లోనే ఎలాంటి కీళ్ళ నొప్పులైనా ఇట్టే త‌గ్గిపోతాయి. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతులు 
ఒక టీస్పూన్ మెంతుల‌ను తీసుకుని వాటిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున మెంతులు తిని ఆ నీటిని తాగాలి. దీంతో ఎలాంటి కీళ్ల నొప్పి అయినా ఇట్టే న‌యం అవుతుంది. అయితే ఈ విధానాన్ని క‌నీసం 3 నెల‌ల వ‌ర‌కు పాటించాలి. నొప్పి కొంచెం తక్కువ‌గా ఉన్న‌వారికైతే 30 నుంచి 40 రోజుల్లోనే చెప్పుకోద‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది.
పారిజాత ఆకులు
పారిజాత మొక్క తెలుసుగా. దీని పూలు తెలుపు రంగులో ఉంటాయి. రాత్రి పూట ఈ పూలు పూస్తాయి. చాలా దూరం వ‌ర‌కు ఈ పూల సువాసన వ‌స్తుంది. దేవాల‌యాల్లో ఎక్కువ‌గా ఈ మొక్క‌లు ఉంటాయి. వీటి ఆకుల‌ను 6 తీసుకుని మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ఒక గ్లాస్ నీటిలో వేసి మ‌రిగించాలి. ఆ నీరు స‌గం అయ్యే వ‌ర‌కు క‌షాయం కాచుకోవాలి. అలా వ‌చ్చిన కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే చ‌ల్ల‌గా ఉండగా తాగేయాలి.

పైన చెప్పిన పారిజాత ఆకుల క‌షాయం కీళ్ల నొప్పుల‌కు ఎంతో అద్భుత‌మైన ఔష‌ధంగా పనిచేస్తుంది. దీన్ని నిత్యం ఏ రోజు కారోజు త‌యారుచేసుకుని తీసుకుంటే కేవ‌లం 30 నుంచి 40 రోజుల్లోనే ఎలాంటి కీళ్ల‌నొప్పులైనా దూర‌మ‌వుతాయి. ఎముక‌ల్లో అరిగిపోయిన కార్టిలేజ్ గుజ్జు తిరిగి ఉత్ప‌త్తి అవుతుంది. ఈ ఔష‌ధం డెంగీ జ్వ‌రానికి కూడా బాగానే ప‌నిచేస్తుంది. డెంగీ కార‌ణంగా వ‌చ్చే ఒళ్లు నొప్పులు త‌గ్గుముఖం ప‌ట్టాలంటే ఈ ఔష‌ధాన్ని తాగాలి.
గమనిక:- పైన చెప్పిన రెండు ప‌ద్ధ‌తుల్లో ఏదో ఒక‌దాన్ని మాత్ర‌మే చేయండి.

Popular Posts

Latest Posts