వెయ్యేళ్ల కిందట సిమెంట్, ఉక్కు లేకుండా 13 అంతస్తులు పూర్తిగా గ్రానైట్ రాయితోనే కట్టించారు - ఆ గుడిలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు

తమిళనాడులో కావేరీ నదికి దక్షిణాన ఉన్న తంజావూరులో ఉంది బృహదీశ్వరాలయం. దానికి వెయ్యేండ్లు నిండాయి. అందులో భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉంది. అదే బృహదీశ్వరాలయం. దీనిని క్రీ.శ.11 వ శతాబ్దంలో చోళుల పాలకుడు మొదటి రాజరాజచోళుడు నిర్మించాడు.
 • కట్టడానికి సలాం ..! మిస్టరీలకు నిలయం తంజావూరు బృహదీశ్వర ఆలయం. ఎక్కడా సిమెంట్, ఉక్కు అన్నమాటకు తావులేకుండా నిర్మించిన ఈ దేవాలయాన్ని చూస్తే అప్పటి టెక్నాలజీకి సలాం చేయకమానరు.  
 • శివలింగం వెయ్యేళ్ల కిందట కట్టిన ఈ ఆలయం అప్పట్లో ఇండియాలోనే అతిపెద్ద ఆకాశహర్మం. 13 అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఉన్నది. దీని ఎత్తు 3.7 మీటర్లు.
 • నంది శివుని వాహనం నంది కూడా తక్కువేం కాదు. ఇదొక ఏకశిలా విగ్రహం. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటింది.
 • గ్రానైట్ రాయి ఈ ఆలయం నిర్మించటానికి సిమెంట్, ఉక్కు వాడలేదు. పూర్తిగా 13 అంతస్తులు గ్రానైట్ రాయితోనే కట్టించారు.
 • గోపురం ప్రధాన ఆలయానికి గోపురం హైలెట్. 13 అంతస్తులు ఎటువంటి వాలు సహాయం లేకుండా నిలబడటం అనేది.
 • మధ్యాహ్నం ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో అంశం మిట్టమధ్యాహ్నం ఆలయం యొక్క గోపురం నీడ ఎక్కడా పడకపోవడం. గుడి నీడన్న పడుతుందేమో గానీ గోపురం నీడ అస్సలు పడదు.
 • సువిశాలం ఆలయ శబ్ద పరిజ్ఞానాన్ని మెచ్చుకోకతప్పదు. ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకొనే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు.
 • సొరంగాలు ఆలయంలో అనేక సొరంగమార్గాలు ఉన్నాయి. కొన్ని తంజావూరులోని ఆలయాలకు దారితీస్తే, మరికొన్ని మరణానికి దారితీసేవిగా ఉన్నాయి. వీటిని రాజరాజచోళుడు తగుజాగ్రత్తల కోసం ఏర్పాటుచేసుకున్నాడని చెబుతారు.
 • రాతితోరణాలు గుడిలో ఆశ్చర్యపరిచే మరో టెక్నాలజీ అంశం గుడి చుట్టూ ఉన్నరాతి తోరణాలు. ఈ తోరణాల యొక్క రంధ్రాలు ఆరు మీ.మీ ల కన్నా తక్కువ సైజులో వంపులతో ఉంటాయి. అంత చిన్నగా ఎందుకు పెట్టారో ఎవరికీ తెలీదు.
 • విశేషాలు వందల సంవత్సరాల క్రితం నాటి గుడులు ఇప్పుడు శిధిలావస్థ దశలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం చెక్కుచెదరకుండా అత్యద్భుతంగా, ఇప్పుడిప్పుడే కట్టారా ? అన్న రీతిలో ఉంటుంది. ఇన్ని వింతలు, విశేషాలు నెలకొన్న ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది.
 • మిస్టరీయే ..! ఒకప్పుడు సువిశాల రాజ్యానికి కేంద్రబిందువువైన తంజావూరు ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు సైతం అంతుపట్టలేదు.
 • శిల్పం గుడి చుట్టుపక్క ప్రాంతాలలో ఇప్పటికీ పురావస్తుశాఖ వారు తవ్వకాలను జరుపుతున్నారు. తవ్వకాలు జరిపిన ప్రతిసారి ఎదో ఒక శిల్పమో లేదా ఆనాటి కాలానికి సంబంధించిన వస్తువో బయటపడుతూ ఉంది ... ఆనాటి వైభవాన్ని చాటుతూ ఉంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)