కిడ్నీ స్టోన్స్ ను శాస్వతంగా నివారించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

Loading...
 • కిడ్నీ స్టోన్స్ ఏర్పడిన తర్వాత వాటిని శాస్వతంగా నివారించుకవోడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈక్రింది విధంగా ఉన్నాయి..
 • యాపిల్స్: యాపిల్స్ కిడ్నీస్టోన్స్ ను నివారిస్తాయి. రోజూ ఒక ఫ్రెష్ యాపిల్ తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న వారు ఖచ్చితంగా రోజుకు ఒక ఆపిల్ తింటే మంచి ఫలితం ఉంటుంది.
 • తులసి: ఈ మూలిక కిడ్నీ స్టోన్స్ ను కరిగించడానికి నేచురల్ టానిక్ లా పనిచేస్తుంది. ఫ్రెష్ గా ఉండే తులసి ఆకులను రసం చేసి, తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఆరు నెలల పాటు తీసుకుంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది.
 • ద్రాక్ష: కిడ్నీ స్టోన్స్ నివారించడంలో ద్రాక్ష గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే ద్రాక్షలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇంకా పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతర న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీస్టోన్స్ కరిగిపోతాయి. ఈ పండ్లలో సోడియం క్లోరైడ్, అల్బునియం తక్కువగా ఉండటం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి.
 • వాటర్ మెలోన్ : పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పుచ్చకాయను రెగ్యులర్ గా తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. ఎలాంటి నొప్పి లేకుండా కిడ్నీ స్టోన్స్ ను బయటకు నెట్టివేస్తాయి.
 • కిడ్నీ బీన్స్: కిడ్నీ బీన్స్ ఎక్సలెంట్ హోం రెమెడీ. ఇది కిడ్నీ స్టోన్స్ ను బయటకు నెట్టివేయడంలో గొప్పగా సహాయపడుతుంది. కిడ్నీ బీన్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రాళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడూ ఫ్రెష్ గా నానబెట్టి, ఉడికించిన కిడ్నీ బీన్స్ ను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 • ఆస్పరాగస్: ఆస్పరాగస్ ను రోజూ తినడం వల్ల ఇందులో ఉండే ఆస్పరాజిన్ కిడ్నీలో స్టోన్స్ ను బ్రేక్ చేస్తుంది. ఇది కిడ్నీలో స్టోన్స్ ను చిన్నగా విచ్చిన్నం చేసి, యూరిన్ ద్వారా బయటకు నెట్టేస్తుంది.
 • యాపిల్ సైడర్ వెనిగర్ : మరో సింపుల్ రెమెడీ. శరీరంలో కిడ్నీ స్టోన్స్ నివారించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగాలి. భోజనానికి ముందు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కిడ్నీలో రాళ్లను మెత్తగా మార్చి, స్టోన్స్ ను కరిగించేస్తుంది.
 • లిన్ సీడ్ టీ కిడ్నీ స్టోన్స్ కరిగించుకోవడానికి లిన్ సీడ్ టీ తాగాలి. లిన్ సీడ్స్ ను ఒక గ్లాసు నీటిలో వేసి 15 నిముషాలు ఉడికించాలి. అందులో నిమ్మరసం, తేనె మిక్స్ చేసి వేడి వేడిగా తాగాలి. ఒక రోజులో 5 సార్లు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో కిడ్నీ స్టోన్స్ బయటకు వచ్చేస్తాయి.
 • వాటర్ థెరఫీ: ఎక్కువ నీళ్ళు తాగాలి. ఒక రోజుకు మూడు లీటర్ల నీళ్ళు తాగడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. కిడ్నీలోని స్టోన్స్ మూత్రం ద్వారా బయటకు రావలంటే రోజూ సరిపడా నీళ్ళు తాగాలి.
 • విటమిన్ బి6 కిడ్నీ స్టోన్స్ ను కరిగించడానికి విటమిన్ బి6 సప్లిమెంట్ తీసుకోవాలి. 100 నుండి 150యంజిల సప్లిమెంట్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ స్టోన్స్ బయటకు నెట్టేస్తాయి.
Loading...

Popular Posts