ద్రాక్ష పళ్ళతో ఇలా చేస్తే చాలా యంగ్ గా కనిపిస్తారు.. మీ వయస్సు 10ఏళ్ళు ఖచ్చితంగా తగ్గిపోతుంది..

చర్మంపై ఏర్పడే మృతకణాలతో అసలు వయసుకంటే చాలా ఎక్కువగా కనిపించేలా చేస్తాయి. అందుకే చర్మ సౌందర్యం కోసం వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. ఈ క్రమంలో వాడే కాస్మోటిక్స్ లో ఉండే రసాయనాలతో తాత్కాలికంగా ఫలితం కనిపించినా దీర్ఘకాలంలో చర్మానికి తీరని నష్టం జరుగుతుంది. ఇప్పుడు కింద తెలుసుకోబోయేది పూర్తిగా సహజ సిద్ధమైంది. చర్మానికి ఎటువంటి హాని, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మ సౌందర్యంలో పదేళ్ల తగ్గుదలను అనుభవపూర్వకంగా పొందొచ్చు..
  • నల్లద్రాక్ష పళ్లను నలిపి గుజ్జు తీయాలి. దానికి చెంచా పంచదార, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మృదువుగా మర్దన చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి 1 లేదా 2సార్లు ఇలా చేస్తే ముఖంపై మృత కణాలన్నీ తొలగిపోతాయి. 5 వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే అనూహ్యమైన ఫలితం వస్తుంది. ముఖంలో వయసు మాయమై కనీసం 10యేళ్లు యంగ్ గా కనిపిస్తారు.
  • ద్రాక్ష రసంలో, 2 చుక్కల బాదం నూనె కలిపి పాదాలకు చేతులకు మర్దన చేయాలి. ఫలితంగా రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం మృదువుగా మారుతుంది. దీన్నే పెదాలకు రాసుకుంటే నలుపుదనం పోతుంది.
  • ఒక కప్పు పచ్చ ద్రాక్ష పళ్లను తీసుకొని చేతులతో కలిపి గుజ్జుగా చేయాలి. వాటిలో 2 చెంచాల పాలు, ఓ టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిముషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖం పై ఉండే మొటిమల తాలూకు మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)