అన్ని రకాల జుట్టు సమస్యలు పోయి ఆరోగ్యమైన జుట్టు పొందాలంటే ఇది వాడితే చాలు.. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుందంటున్నారు నిపుణులు.

Loading...
ఆరోగ్యమైన జుట్టు పొందాలంటే గ్రీన్‌ టీ వాడితే చాలు.. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఇది జుట్టు ఊడటం, చుండ్రు లాంటి సమస్యల నివారణకు మంచి కండీషనర్‌గా పని చేస్తుంది. 
జుట్టు పెరగటానికి: 
ఒక కప్పులో రెండు చెంచాల గ్రీన్‌ టీ పౌడర్‌, మూడు చెంచాల నిమ్మరసం, ఒక చెంచా కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. ఇది ఆరాక స్నానం చేస్తే సరి. వెంట్రుకలు మృదువుగా, పొడవుగా పెరగటానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
చుండ్రు పోవటానికి: 
కొద్దిగా గోరు వెచ్చని నీటిలో మూడు చెంచాల గ్రీన్‌ టీ పౌడర్‌ వేసి దాంట్లో ఒక గుడ్డు కలపాలి. ఈ మిశ్రమం పలుచగా ఉంటే ఇంకొక చెంచా పౌడర్‌ను కలిపితే సరిపోతుంది. ఈ మొత్తం పేస్టును తలకు పట్టించి ఇరవై నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. తలలో ఉన్న చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది.
గ్రీన్ టీ తో హెయిర్‌ కండీషనర్‌: 
ఒక కప్పులో రెండు చెంచాల గ్రీన్‌ టీ పౌడర్‌ వేసి దాంట్లో రెండు చెంచాల కొబ్బరి నూనె, చెంచా తేనె కలిపితే.. సహజమైన గ్రీన్‌ టీ హెయిర్‌ కండీషనర్‌ సిద్ధమైనట్లే. ఈ పేస్టును తలకు పట్టించి ఓ అరగంట ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది.
Loading...

Popular Posts