గుప్పెడు ఎండుద్రాక్షను రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే తింటే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు

Loading...
ఎండుద్రాక్ష చూడ్డానికి సన్నగా ఉన్నా.. అందులోని పోషకాలు అమోఘం. ఎండుద్రాక్షలో విటమిన్ బి, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ ఎండు ద్రాక్ష టేస్టీగానే కాదు, తేలికగా తినవచ్చు. అలాగే కార్బోహైడ్రేట్స్ కావాల్సిన మోతాదులో పొందవచ్చు. దీనివల్ల రోజంతటికీ కావాల్సిన ఎనర్జీ అందుతుంది.
ప్రతిరోజూ ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఒబేసిటీ, గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ వంటివి అడ్డుకోవచ్చు. సాధారణంగా బాదాం ప్రతిరోజూ తినాలని సూచిస్తుంటారు. ఎప్పుడూ అవే అంటే.. బోర్ అనిపిస్తుంది. కాబట్టి ఎండుద్రాక్షని.. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తో పాటు తీసుకోవడం లేదా.. సాయంత్రం స్నాక్స్ గా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
రాత్రంతా నానబెట్టిన ఎండుద్రాక్ష - ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి అనీమియా నివారించడంలో గ్రేట్ గా సహాయపడతాయి. కాబట్టి అనీమియాతో బాధపడేవాళ్లు.. రాత్రంతా గుప్పెడు ఎండుద్రాక్షను నానబెట్టి.. ఉదయాన్నే తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.
ఎండుద్రాక్షతోపాటు, వెల్లుల్లి
- ఎండుద్రాక్ష ద్వారా పొటాషియం ఎక్కువగా పొందవచ్చు. ఇది.. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి బీపీతో బాధపడేవాళ్లు.. ఒక టీస్పూన్ ఎండుద్రాక్ష, ఒక వెల్లుల్లి రెబ్బను రెగ్యులర్ గా తీసుకుంటే.. మెరుగైన ఫలితాలు చూస్తారు.
ఓట్స్ లో ఎండుద్రాక్ష
- ఎండుద్రాక్షలో ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల క్యాన్సర్ తో పోరాడతాయి. కాబట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ రూపంలో ఒక కప్పు ఓట్ మీల్ లో.. గుప్పెడు ఎండుద్రాక్ష మిక్స్ చేసి తీసుకోవడం మంచిది.
పాలు, ఎండుద్రాక్ష
- ఎండుద్రాక్ష జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్దకాన్ని పూర్తిగా నివారిస్తాయి. ఈ సమస్య నివారించడానికి గుప్పెడు ఎండుద్రాక్షను ఒక కప్పు పాలలో ఉడికించి.. రాత్రి పడుకోవడానికి గంట ముందు తినాలి.
సాయంత్రం స్నాక్స్
- ఎండుద్రాక్షలో స్ట్రాంగ్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి.. జ్వరం తగ్గించడంలో సహాయపడతాయి. గుప్పెడు ఎండుద్రాక్షను సాయంత్రం స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల.. ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ అయినా తగ్గిపోతుంది.
Loading...

Popular Posts