ఈ టిప్స్ ఫాలో అయితే ఎలాంటి అమ్మాయి అయినా పడిపోవాల్సిందే. ఇక మీరు ఏమి చెపితే అది చేయాలిసిందే

Loading...
అమ్మాయి మనసుని అర్ధం చేసుకోవడం ఎవరి వల్లా కాదు. చివరికి ఆ ఆమ్మాయిని సృష్టించిన దేవుడికి కూడా అది సాధ్యం కాదు. పోనీ ఒక అమ్మాయి మనసుని ఇంకో అమ్మాయి తెలుసుకోగాలదా అంటే.. అది కూడా కాని పనే అని తేలిపోయింది. వీరి మనసునే కాదు... వీరి మాటలు అర్ధం చేసుకోవడం కూడా అంతే కష్టం. అందుకే అన్నారు.. ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే.. అని.

ఇలా ఎవరికీ అర్ధం కాని ఆడవారిని పడేయాలంటే మాటల్లో వర్ణించలేనంత కష్టం. ఆడవాళ్ళతో డీల్ చేసేటప్పుడు ముందు చాలా ఓపిక అవసరం. ఎంత ఓపికగా ఉంటె అంత లాభం. కొన్ని సార్లు నటించాలి, నమ్మించాలి, నిజాయితీగా ఉండాలి, అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్దాలు చెప్పాలి.  ఇలాంటివే ఇప్పుడు మేము చెప్పబోయే టిప్స్ పాటిస్తే ఎలాంటి అమ్మాయి అయినా మీకు పడిపోవాల్సిందే..!! సో ఇంకెందుకు ఈ టిప్స్ ఫాలో అయిపోండి చాలు..!! ఈ ఆర్టికల్ కొంచెం పెద్దదే ఓపిక చేసుకుని జాగ్రత్తగా అర్ధం చేసుకోండి.
 • అందమైన అమ్మాయితో మాట్లాడేటప్పుడు తన మాటలకన్నా తన అందంపై ఎక్కువ ద్యాస పెడుతుంటారు. ఇది వాళ్ళు తప్పకుండా గమనిస్తారు. తన అందాన్ని చూడాలని తను కూడా కోరుకుంటుంది.. కాని మాట్లాడేటప్పుడు ఇలా చేస్తే మీ పై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. అలా కాకుండా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. ఇలా చేస్తే మీ పై మంచి అభిప్రాయం ఏర్పడడంతో పాటు మీ పై నమ్మకం పెరుగుతుంది.
 • ఈ మధ్య గడ్డం పెంచుకోవడం ఫ్యాషన్ గా మారింది. ఈ అబ్బాయిని చూసిన రకరకాల బియర్డ్ స్టైల్స్ తో దర్శనమిస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి వారికీ దూరంగా ఉండే వారు అమ్మాయిలు. కాని ఇప్పుడు అమ్మయిలు కూడా ఇలాంటి వారిని ఇష్టపడుతున్నారు. గడ్డంతో ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారు కాని.. ఆ గడ్డం సరిగ్గా ట్రిమ్ చేసి లేకపోతే చిరాకు పడతారు. మిమ్మల్ని అడవిలోనుంచి పారిపోయి వచ్చిన ఓ క్రూర మృగాన్ని చూసినట్టు చూస్తారు. ఇదే కాదు అమ్మాయిలకు దుర్వాసన అంటే చెడ్డ చిరాకు. సో వీరిని కలిసేటప్పుడు నీట్ గా ఉండేలా చూసుకోండి.
 • ఇప్పుడున్న స్మార్ట్ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరుంటారు చెప్పండి? కుదిరితే 24 గంటలు ఆ ఫోన్ లో తలకాయ పెట్టి కాలక్షేపం చేసేస్తారు. కాని మీరు నచ్చిన అమ్మాయితో ఉన్నప్పుడు ఆ ఫోన్ కాస్త పక్కకు పెట్టండి. ఇలా చేస్తే తనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్ధం చేసుకుంటుంది. మరీ ఇంపార్టెంట్ అయితే తప్ప.. ఫోన్ అసలు వాడకండి.
 • అమ్మాయిలకు వారి గురించి ఇతరులకు చెప్పాలని ఉంటుంది. కాని అంతే మోతాదులో మొహమాటం కూడా ఉంటుంది. ఈ ఛాన్స్ ని మీరు మిస్ చేసుకోకండి. అమ్మెను ప్రశ్నించడం మొదలుపెట్టండి. ఆమె ఇష్టాలను, అయిష్టాలను తెలుసుకోండి. వాటికి తగ్గట్టు వ్యవహరించండి. దీంతో ఆమె ఇష్టపడే లిస్టులో మీరు కూడా చేరిపోతారు.
 • అప్పుడప్పుడు తన అందం గురించి పొగడండి. అలాగని మారీ ఎక్కువ పొగిడితే... వామ్మో వీడు నాలో ఇంత గమనించాడా? అని అపార్ధం చేసుకుంటుంది. అందుకే ఈ విషయంలో ఆచి తూచి మాట్లాడండి.
 • అమ్మాయిలకు ఏదైనా విషయంలో అవసరమొస్తే ఎదుటి వారి సహాయం కోరడానికి మొహమాటపడతారు. ఇలాంటప్పుడు మీరే అడిగి తెలుసుకోండి. కేవలం డబ్బు సహాయం మాత్రమే కాదు.. అప్పుడప్పుడు తనకి మానసిక సహాయం కూడా అవసరమవుతుంది. తను మానసికంగా ఏదైనా ఒత్తిడిలో ఉంటె మీరు తన బలం అవ్వండి.
 • మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆమె సలహాను కోరండి. చిన్న చిన్న షాపింగ్ నుండి... మీరు ఏ ఉద్యోగంలో చేరబోతున్నారో.. ఇలా అన్నిటిలోను తన సలహా తీసుకోండి. ఆమె సలహాకు మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలిస్తే మార్కులు కొట్టేసినట్టే.
 • తనతో మీరు ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో చెప్పండి. తనలో మీకు నచ్చేవి చెప్పడంలో మొహమాటపడకండి. తనలో ఉన్న పోజిటివ్ క్వాలిటీస్ ఏంటో చెప్పండి. ఒకవేళ నెగటివ్ ఏమైనా ఉంటె మీ దగ్గరే పెట్టుకోండి. ఎంతైనా మొగవారు కదా.. ఆ మాత్రం త్యాగం చేయాలి మరి.
 • మీతో బయటకు వచ్చినప్పుడు యువరాణిలా చూసుకోండి. సినిమాల్లో చూపించినట్టే.. వారికి కూడా ఎవరైనా చేయాలని ఉంటుంది. చేయాలనుకున్నప్పుడు చేసి పారేయండి. ఎవరైనా చూస్తారేమో, ఏమైనా అనుకుంటారేమో అని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీరు అమ్మాయిని ఇంప్రెస్స్ చేయాలి.. పక్కనోళ్ళని కాదు.
 • మీరేదైన టాపిక్ మాట్లాడుతున్నప్పుడు తన అభిప్రాయాలకు మర్యాద ఇవ్వండి. ఎప్పుడు కూడా మొగవారు గొప్ప లేక ఆడవారు గొప్పా అనే టాపిక్ మీ మధ్యలో తేకండి. ఒకవేళ అలంటి టాపిక్ వస్తే ఆడవారే గొప్ప అని అనండి ఎందుకంటే అమ్మాయి పడాలి కదా బాసూ !!!!
 • అమ్మాయిలకు కొత్త కొత్త వస్తువులంటే చాలా ఇష్టం. ఎప్పుడో ఓ సారి ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వడం కన్నా... వారానికోసారి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తే తెగ ఆనందపడిపోతారు. 
 • జాగ్రత్తగా ఈ టిప్స్ ఫాలో అయితే ఎలాంటి  అమ్మాయి అయినా పడిపోవాల్సిందే. ఇక మీరు ఏమి చెపితే అది చేయాలిసిందే
Loading...

Popular Posts