ఈ సూచనలు పాటిస్తే వారికి అదృష్టం ఎప్పుడూ తోకలా వెన్నంటే ఉంటుంది

Loading...
అదృష్టం… జీవితంలో చాలా మంది ఇది క‌ల‌సి రాద‌ని బాధ‌ప‌డుతుంటారు. కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే అదృష్టం క‌ల‌సి వ‌స్తుందని, తాము ఏం చేసినా దుర‌దృష్టం వెంటాడుతూనే ఉంటుంద‌ని అధిక శాతం మంది బాధ‌ప‌డుతుంటారు. తమ దుర‌దృష్టానికి త‌మ‌ను తామే నిందించుకుంటూ కాలం గ‌డుపుతూ ఉంటారు. అయితే అలాంటి వారు కింద ఇచ్చిన కొన్ని సూచ‌న‌లు పాటిస్తే వారికి ల‌క్ ఎప్పుడూ తోక‌లా వెన్నంటే ఉంటుంద‌ట‌. ఏది చేసినా క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. మరెందుకాల‌స్యం, ల‌క్ క‌ల‌సి రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి. 

రావి ఆకు ఒక రావి ఆకును తెంపి దాన్ని శుభ్రంగా క‌డిగి మీ ఇంట్లో పెట్టుకోండి. దీంతో ల‌క్ ఎప్పుడూ మీకు క‌ల‌సి వ‌స్తుంది. అంతేకాదు మీ చుట్టూ పాజిటివ్ శ‌క్తి కూడా ఉంటుంద‌ట‌.

బియ్యం గింజ‌లు దేవాల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు బియ్యం గింజ‌ల‌ను ల‌క్ష్మీ దేవికి ఇవ్వ‌డం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ఈ క్ర‌మంలో మీ ప‌ర్సులో కొన్ని బియ్యం గింజ‌ల‌ను పెట్టుకున్నా అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ట‌.

క‌రెన్సీ నోట్లు ఒక 20 రూపాయ‌ల నోటు, 2 రూపాయి నోట్లు క‌లిపి వాటిని సిల్వ‌ర్ పేప‌ర్‌లో చుట్ట‌గా చుట్టి ప‌ర్సులో పెట్టుకోవాలి. దీంతో ల‌క్ క‌లిసి వ‌స్తుంది. అయితే అలా చుట్టిన డ‌బ్బుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉప‌యోగించ‌కూడ‌దు.

విష్ణువు, ల‌క్ష్మి ఫొటో
శేష‌త‌ల్పంపై ప‌డుకున్న విష్ణువు పాదాల‌ను ఒత్తుతున్న ల‌క్ష్మీ దేవి ఫొటోను ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌ట‌. దీని వ‌ల్ల కూడా ల‌క్ క‌ల‌సి వ‌చ్చి అనుకున్న ప‌నులు త్వ‌ర‌గా జ‌రుగుతాయ‌ట‌.

తెల్ల‌ని గులక రాళ్లు
టివి రూమ్ లో కానీ, బెడ్ రూమ్ లో కాని చిన్న చిన్న గులక రాళ్లు పెట్టుకున్నా అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. పాజిటివ్ శ‌క్తి పెరుగుతుంద‌ట‌.

ల‌క్ష్మీ గ‌వ్వ‌లు ప‌సుపు రంగులో చిన్న‌గా ఉండే గ‌వ్వ‌ల‌ను ల‌క్ష్మీ గ‌వ్వ‌ల‌ని పిలుస్తారు. వీటిని ద‌గ్గ‌ర పెట్టుకున్నా ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. అనుకున్న ప‌ని జ‌రుగుతుంది.

తామ‌ర పువ్వు విత్త‌నాలు తామ‌ర పువ్వు విత్త‌నాల‌ను ద‌గ్గ‌ర పెట్టుకుంటే మాన‌సికంగా ఆరోగ్యం క‌లుగుతుంది. అదృష్టం కూడా క‌ల‌సి వ‌స్తుంది.

శ్రీ‌యంత్రం మంత్రించిన శ్రీ‌యంత్రాన్ని ప‌ర్సులో పెట్టుకుంటే ధ‌నం బాగా స‌మ‌కూరుతుంది. అదృష్టం కూడా బాగా వ‌స్తుంది.

గోమ‌తి చ‌క్ర‌ గోమ‌తి చ‌క్ర అని పిల‌వ‌బ‌డే ప్ర‌త్యేక‌మైన శంకుల‌ను ద‌గ్గ‌ర పెట్టుకుంటే ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ల‌క్ కూడా క‌ల‌సి వ‌స్తుంది. మానసిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది.
Loading...

Popular Posts