కేవలం ఒకే ఒక టీస్పూన్ తేనెతో పొట్ట తగ్గించే అమేజింగ్ ఐడియాస్

Loading...
 • తేనెలో ఒక ప్రత్యేకమైన విటమిన్ ఉంటుంది. అందుకే.. ఇది శరీరానికి, చర్మానికి, జుట్టుకి, శరీరంలో రక్తానికి ఉపయోగపడుతుంది. తేనె కేవలం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలనే కాదు.. బరువు తగ్గాలి అనుకునేవాళ్లకు ఒక అద్భుతమైన ఆప్షన్. తేనెలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. తేనె బరువు తగ్గడానికి చాలా అమేజింగ్ గా ఉపయోగపడుతుందని.. తాజా అధ్యయనాలు తేల్చాయి. సర్ప్రైజింగ్ రిజల్ట్స్ పొందడానికి తేనెను ఎలా ఉపయోగించాలో చూద్దాం. 
 • ఒకవేళ మీరు అధిక బరువు ఉన్నారంటే.. ఎలాంటి పెద్ద పెద్ద టాస్క్ లు చేయాల్సిన పనిలేదు. కేవలం ఒకే ఒక టీస్పూన్ తేనెను మీ డైట్ లో చేర్చుకుంటే చాలు. కాకపోతే.. బరువు తగ్గడానికి ఒక టీస్పూన్ తేనెను ఉపయోగించే పద్ధతులు చాలా ఉన్నాయి. మరి తేనెను ఎలా ఉపయోగిస్తే.. తేలికగా బరువు తగ్గుతారో.. తెలుసుకుందాం..
 • పంచదార పంచదారను ప్రాసెస్ చేసిన తర్వాత అందులోని ముఖ్యమైన పోషకాలను కోల్పోతుంది. డైట్ లో ఎక్కువగా పంచదారను చేర్చుకుంటే.. కాలేయం వాపు వస్తుంది. పంచదార రక్తంలోకి వెళ్లినప్పుడు.. అది ఫ్యాటీ యాసిడ్స్ గా మారుతుంది. ఈ యాసిడ్స్ పొట్ట, రొమ్ము, తొడల భాగంలో చేరుకుంటాయి. దీనివల్ల అధిక బరువు పెరుగుతారు.
 • పంచదారకు బదులు తేనె పంచదార లాగా కాదు తేనె. ఇది న్యాచురల్ గా ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ.. ఫ్యాట్, కొలెస్ట్రాల్ కరిగించడానికి సహాయపడతాయి. మెటబాలిజంను పెంచుతాయి. ఒబేసిటీని అరికడతాయి.
 • తేనె, దాల్చిన చెక్క ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ తేనెను ఒక కప్పు గోరువెచ్చని నీటిలో మిక్స్ చేయాలి. దీన్ని ఉదయాన్నే పరకడుపున తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గినట్టు.. చాలా మంది రివ్యూ కూడా ఇచ్చారు.
 • తేనె నిమ్మరసం ఒక టీస్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసంను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి. ఈ డ్రింక్ ని ప్రతి రోజు నిద్రలేవగానే తాగితే.. ఇంటెస్టినల్ ట్రాక్ ప్యూరిఫై అయి.. ఫ్యాట్ కరిగిపోతుంది.
 • తేనె, గోరువెచ్చని నీళ్లు ఒక గ్లాసు వెచ్చటి నీటిలో ఒక టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే తీసుకోవాలి. ఈ డ్రింక్ తాగడం వల్ల.. ఎంతో కాలం నుంచి పేరుకున్న ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది.
 • ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టీస్పూన్ తేనె, 2 టీస్పూన్ల నిమ్మరసం కలిపి.. ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఈ డ్రింక్ ని రోజులో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. ఇది హైడ్రేటెడ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటుంది. శరీరంలో పేరుకున్న ఫ్యాట్స్ ని తొలగిస్తుంది.
 • వ్యాయామానికి ముందు, తర్వాత ఒక బాటిల్ నిండా నీటిని నింపి.. అందులో ఒక టీస్పూన్ తేనె కలపాలి. ఈ నీటిని వ్యాయామానికి ముందు, వ్యాయామం చేసేటప్పుడు, వ్యాయామం చేసిన తర్వాత తీసుకోవాలి. అంతే అద్భుతమైన ఫలితాలు చూస్తారు.
 • అల్లం, తేనె భోజనానికి 20 నిమిషాల ముందు.. అల్లం టీలో తేనె కలిపి తీసుకుంటే.. తేలికగా బరువు తగ్గవచ్చట. రెండు కప్పుల నీటిని మరిగించి.. అందులో కొద్దిగా అల్లం ముక్క వేయాలి. దాన్ని వడకట్టి.. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఒక టీస్పూన్ తేనె కలిపి.. తాగాలి.
 • హెర్బల్ టీ రాత్రి నిద్రపోవడానికి 30 నిమిషాల ముందు.. ఒక కప్పు హెర్బల్ టీలో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.
Loading...

Popular Posts