భక్తి ఉండడం మంచిదే.. కానీ పూజ గదిలో ఇలాంటి విగ్రహాలు, పటాలు ఉంచడం మంచిది కాదు

Loading...
మీ ఇంట్లో ఓ పూజగది… ఉదయమే మిమ్మల్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంచి, కాస్త ప్రశాంతతను ఇచ్చే గది… కానీ ఆ గదిలో మనకు ఇష్టమొచ్చినట్టు విగ్రహాలు, పటాలు ఉంచేయడం మంచిది కాదు… దానికీ కొన్ని పద్ధతులుంటాయ్… ప్రత్యేకించి మనకు నష్టం కలిగించే వాటిని ముందు అవాయిడ్ చేయడం అత్యవసరం… అందులో ఒకటి ఎప్పుడూ నిలబడి ఉన్న గణుషుడు, సరస్వతి విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదు…

నిజానికి ఇంట్లో గణేషుడు, సరస్వతి విగ్రహాలు ఉండటం అదృష్టదాయకమే… కానీ ఆ దేవుళ్లు నిలబడి ఉన్న విగ్రహాలు మాత్రం నష్టకారకాలు… ఆ దేవుళ్లు కూర్చున్నట్టుగా ఉన్న విగ్రహాలు శ్రేష్టం… అంతేకాదండోయ్…. డబ్బులున్నాయి కదాని పేద్ద పేద్ద విగ్రహాలు తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడబడితే అక్కడ, పూజగదిలో పెట్టేయకండి… పది ఇంచులకన్నా పెద్దగా ఉండే విగ్రహాలు అరిష్టదాయకాలని గుర్తించండి… అవన్నీ గుళ్లల్లో పెట్టుకోవడానికే… ఇళ్లల్లో పెట్టుకోవడం కోసం కాదు… కొంత మంది పేద్ద పేద్ద వినాయక విగ్రహాలను ఇళ్లల్లో ఆడంబరం కోసం పెడుతుంటారు… అవేవీ ఇంటికి గానీ, మీ ఒంటికి గానీ మంచివి కావు… మరీ ఎక్కువ విగ్రహాలను కూడా పూజగదిలో పెట్టకండి… మీ కులదైవాలను, మీ ఇష్టదైవాలను మాత్రమే ఆరాధిస్తే చాలు…
విగ్రహాలను మరీ నేల మీదే గాకుండా కాస్త ఎత్తులో ఉండేట్టు చూసుకొండి… మీరు కూర్చున్నప్పుడు మీ ఛాతీ ఎత్తుకు, దేవుళ్ల పాదాలు ఉన్న ఎత్తుకు సరిపోయేలా చూసుకొండి… అంతేకాదు, ఎప్పుడూ ఊరకే కింద కూర్చోకుండా చాప గానీ, కార్పెట్ గానీ వేసుకుని దానిపై కూర్చొండి… మరణించిన మీ పెద్దల ఫోటోలను పూజగదిలో పెట్టకండి… బయట గోడలకు తగిలిస్తే చాలు… మరణించిన మనుషుల పటాలను తమతోపాటు పూజగదిలో ఉంచడం దేవుళ్లను, విశ్వశక్తిని అవమానించినట్టే అంటుంటారు…

మహాభారతంలోని ఏ దృశ్యాన్ని చిత్రీకరించిన పటాలనైనా పూజగదిలో ఉంచకండి… అలాగే పక్షులు, జంతువుల ఫోటోలూ వద్దు.,.. విగ్రహాల్లో ఏ లోపాలున్నా, డ్యామేజీ అయి ఉన్నా వాటిని పూజించకండి… అది మరింత అరిష్టదాయకం.
Loading...

Popular Posts