ఏదో ఒక పూట తెల్లగా మెరిసిపోయే అన్నం మానేసి రాగి జావా లేదా రాగి సంకటి తినండి. ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందుతారు

  • రాగి జావ లేదా రాగి సంకటి లిమిట్ గా తినాల్సిన పనిలేదు. కడుపు నిండే వరకు తినచ్చుకావాలంటే మనం అన్నంలో కూర ఎలా కలుపుకు తింటామో అలాగే కలుపుకుని తినచ్చు. తెల్లగా పోలిష్ పెట్టిన బియ్యం వండుకుని తినడం వలన అనారోగ్యం కలుగుతుంది. కనీసం ఏదో ఒక పూట ( అది మీ ఇష్టం ఏ పూట వీలైతే ఆ పూటే ) అన్నం మానేసి రాగులతో చేసిన జావ లేదా రాగి సంకటి తింటే ఎప్పటికి ఆరోగ్యంగా ఉంటారు.
  • డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది:- రెగ్యులర్ డైట్ లో రాగులను చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. రాగిలో ఫాలిఫినాల్స్ మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉంది . బియ్యం, బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ కంటే రాగుల్లో ఫైబర్ ఎక్కువ. రాగుల్లో ఉండే హై ఫైబర్ కంటెంట్ జీర్ణశక్తిని పెంచుతుంది, బ్లడ్ షులర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. గ్లిజమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది మధ్యహ్నానం మరియు ఈవెనింగ్ స్నాక్ గా గ్రేట్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది
  • రక్త హీనతకు:- రాగుల్లో ఐరన్ అత్యధికంగా ఉంటుంది. ఇది రక్తంలో హీమోగ్లోబిన్ కు అసవరమయ్యే ఐరన్ ను అందిస్తుంది. దాంతో అనీమియాను సమస్యను తగ్గించుకోవచ్చు. రాగులను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్, రాగులను మొలక కట్టి తినడం వల్ల విటమిన్ సి మరియు ఐరన్ పుష్కలంగా అందుతుంది. ఐరన్ పిల్స్ ను తినడం కంటే డైలీ డైట్ లో రాగిపిండిని చేర్చుకోవడం మంచిది. ఏదో ఒక రకంగా రాగులను చేర్చుకోవడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు
  • యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి:-రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది. చర్మం యంగ్ గా మార్చుతుంది . ప్రీమెచ్యుర్ ఏజింగ్ సమస్య ఉండదు . రాగుల్లో ఉండే అమినినో యాసిడ్స్ మరియు మెతియోనిన్ , స్కిన్ కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మం యొక్క ఫ్లెక్సిబిలిటిని పెంచతుుంది. స్కిన్ సాప్ట్ గా మార్చుతుంది.
  • అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి:- రాగుల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో సాధారణ కార్యాచరణకు కీలకం మరియు శరీర కణజాలముల బాగు కోసం ఇవి చాలా అవసరం. ఇది శరీరంలో నైట్రోజన్ సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
  • ప్రోటీన్స్ ఎక్కువ:- రాగుల్లో ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల మాల్ న్యూట్రిషియన్ లోపంను నివారిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. రాగులను క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులు మరియు పరిణతి వృద్ధాప్యంను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
  • గుండె ఆరోగ్యానికి : కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.
  • బాలింతల్లో పాలఉత్పత్తి: మహిళల్లో పాల ఉత్పత్తి లేకపోవడం ఈ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల కోసం శరీరానికి తగినంత బలాన్ని మరియు ఆరోగ్యాన్నంధించే టానిక్ వంటింది.
  • కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:- రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ కలిగి ఉండి, కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది. థ్రియోనిన్ అమినో యాసిడ్స్ కాలేయంలో కొవ్వు చేరకుండా నివారిస్తుంది. 
  • బరువు తగ్గిస్తుంది:- రాగుల్లో అమినోయాసిడ్స్ వీటిలో ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తాయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. మరియు రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.

Popular Posts

Latest Posts