కొంత మంది ఊరికే నల్లబడిపోతారు దానికి కారణం కొన్ని ఆహారపదార్దాలు.. ఈ ఆహారం వల్ల మీ చర్మం నల్లగా తయారవుతుంది. వీటిని తగ్గిస్తే చాలు

Loading...
ఈ ప్ర‌పంచంలో మ‌నం తినే ఆహార ప‌దార్థాల‌న్నింటిలోనూ ఏవో కొన్ని పోష‌క విలువ‌లు దాగి ఉంటాయి. అలా అని చెప్పి మ‌నం తినేదంతా పోష‌కాహారం మాత్రం కాదు. పోష‌కాలు ఉన్న ఆహారం తింటే దాంతో మ‌న‌కు లాభాలే క‌లుగుతాయి. అలా అని చెప్పి అన్ని పోష‌కాలు మ‌న‌కు లాభాల‌ను క‌ల‌గ‌జేయ‌వు. అందులో న‌ష్టాన్ని కలిగించేవి కూడా ఉంటాయి. వాటిలో మ‌న చ‌ర్మానికి హాని క‌లిగించే, న‌ష్టాన్ని చేకూర్చే పోష‌కాలను గురించే ఇప్పుడు చెప్ప‌బోయేది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ప‌లు ర‌కాల పోష‌కాలు ఉన్న ఆహారాలు తినడం వ‌ల్ల మ‌న శ‌రీర చ‌ర్మాన్ని ఏ విధంగానైతే ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చో, అదే విధంగా మ‌న చ‌ర్మానికి క‌లిగే న‌ష్టాన్ని నివారించ‌డం కోసం పలు ఆహార ప‌దార్థాల‌ను తిన‌కూడ‌దు. మానేయాలి. అలా చేస్తేనే చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. ప్ర‌ధానంగా చ‌ర్మం కాంతివంతంగా మారాల‌నుకునే వారు, మృదువుత‌నం కావాల‌నుకునే వారు ఇప్పుడు చెప్ప‌బోయే ఆహార ప‌దార్థాల‌ను మాత్రం అస్స‌లు తిన‌కూడ‌దు. ఈ క్ర‌మంలో ఆ ఆహార ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరెంజ్ జ్యూస్‌
ఆరెంజస్ తింటేనే మంచిది కానీ జ్యూస్ మంచిది కాదు. ఆరెంజ్ జ్యూస్‌లో ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం) త‌క్కువ‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా పై ప్ర‌భావం చూపుతుంది. దీని వ‌ల్ల చ‌ర్మానికి ర‌క్తం నుంచి పోష‌కాలు స‌రిగా అంద‌వు. దీంతో చ‌ర్మం పొడి బారి పోవ‌డం, న‌ల్ల‌బ‌డ‌డం జ‌రుగుతుంది. క‌నుక ఆరెంజ్ జ్యూస్ తాగ‌కూడ‌దు.
ఆల్క‌హాల్‌
మ‌ద్య‌పానం పూర్తిగా మానేయాలి. లేదంటే శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గురై చ‌ర్మం పొడిబారుతుంది. చ‌ర్మం క‌ణ‌జాలం దెబ్బ తింటుంది. ఈ క్ర‌మంలో చ‌ర్మంపై ముడ‌తలు వ‌స్తాయి. చ‌ర్మం న‌ల్లగా కూడా మారుతుంది.
వేయించిన పదార్ధాలు, కొవ్వు ప‌దార్థాలు
ఫ్రై చేసిన ఆహార ప‌దార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోకూడ‌దు. దీని వ‌ల్ల ర‌క్తంలో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా త‌గ్గిపోతుంది. చ‌ర్మానికి ర‌క్తం నుంచి పోష‌కాలు అంద‌వు. దీంతో చ‌ర్మం న‌ల్ల‌గా అయిపోయి, ముడ‌త‌లు ప‌డుతుంది.
కారం, మ‌సాలా ఆహారం
కారం, మ‌సాలాలు ఎక్కువగా ఉన్న ఘాటు ఆహార ప‌దార్థాల‌ను తిన‌కూడ‌దు. ఇవి శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను పెంచుతాయి. అంతేకాదు, వీటి రక్త నాళాలు వెడ‌ల్పుగా మారుతాయి. ఈ క్ర‌మంలో అది చ‌ర్మంపై ప్ర‌భావం చూపుతుంది. క‌నుక కారం, మ‌సాలాలు ఎక్కువ‌గా ఉన్న ఆహార ప‌దార్థాల‌ను తిన‌కూడ‌దు.
Loading...

Popular Posts