ఆకలిని తగ్గించి, వంటిలో కొవ్వుని కరిగించే ఆహారాలు.. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు

Loading...
హార్మోనుల గురించి మీకు తెలిసే ఉంటుంది. శరీరంలో అత్యంత ముఖ్య పాత్రను పోషించేవి హార్మోనులు. ముఖ్యంగా ఆకలి మరియు ఫ్యాట్ ను బిల్డ్ అప్ చేయడంలో హార్మోనులు ప్రముఖ పాత్రపోషిస్తాయి. ఈ విషయంలో రెండు రకాల హార్మోనులు ఇందులో మిలితమై ఉన్నాయి . వాటిలో గ్రేలిన్ మరియు లెప్టిన్. గ్రేలిన్ హార్మోన్ ఆకలికి కారణం అవుతుంది. ఆకలి వేస్తున్నదని బ్రెయిన్ కు సంకేతాలను పంపడంలో ఈ హార్మోన్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ హార్మోను బాడీలో ఎక్సెస్ అయితే ఎక్కువగా తినడానికి కారణం అవుతుంది. దాంతో శరీంలో ఫ్యాట్ చేరడానికి కారణం అవుతుంది . దాంతో బరువు అమాంతం పెరుగుతారు. 
ఇక రెండవ హార్మోన్ లెప్టిన్. ఇది శరీరంలో అద్భుత పాత్ర పోషిస్తుంది. ఆకలి తీరి కడుపు నిండిందన్న సంకేతాలను బ్రెయిన్ కు చేరవేస్తుంది. ఇది మిమ్మల్ని ఎక్కువగా తినకుండా ఆపుతుంది. మరియు శరీరంలో కొవ్వు నిల్వ చేరకుండా చేస్తుంది. ఈ లెప్టిన్  బాడీలో సరైనా మోతాదులో స్రవించకపోతే, మీరు ఎప్పటీకి ఫుల్ ఫిల్ గా భావించలేరు. పొట్టనిండిన అనుభూతి కలగదు మరియు ఎప్పుడూ ఆకలివేస్తుంటుంది. ఫలితంగా శరీరంలో ఫ్యాట్ చేరడానికి కారణం అవుతుంది. మరి శరీరంలో ఫ్యాట్ బర్న్ చేసే ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం....
గుడ్లు: బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు తినడం వల్ల గ్రెలిన్ హార్మోన్ అణచివేయడానికి సహాయపడుతుంది. అందువల్ల, రోజులో మీకు చాలా తక్కువగా ఆకలేస్తుంది.
ఓట్స్: ఓట్స్ ను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల మీకు తొందరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఓట్స్ లో కరగని ఫైబర్ ఉంటుంది. ఫలితంగా ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.
ఉడికించిన బంగాళదుంపలు: కొన్ని బంగాళదుంపలను ఉడికించి వాటి మీద కొద్దిగా మిరియాల పొడి చిలకరించి తీసుకోవాలి. ఇది శరీరంలోని ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
Loading...

Popular Posts