మీరు పూజించే వినాయకుడు ఎలా ఉన్నాడు ? ఏ రంగు? కూర్చున్నాడా నిల్చున్నాడా ? ఎలాంటి వినాయ‌కుల బొమ్మ‌ల‌ను పూజిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Loading...
హిందూ సాంప్ర‌దాయంలో గ‌ణేషుడికి ఎంతటి ప్రాధాన్య‌త ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఏ పూజ చేసినా ముందుగా వినాయ‌కుడిని పూజించాకే దాన్ని మొద‌లు పెడ‌తారు. ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు క‌ల‌గ‌కుండా మ‌న‌కు అన్ని విధాలుగా లాభం చేకూరుస్తాడ‌ని, గ‌ణేషున్ని ముందుగా ప్రార్థిస్తారు. ఈ క్రమంలో వినాయ‌కున్ని మామూలుగా ఎలా పూజించినా కూడా దాని వ‌ల్ల మ‌న‌కు మేలే జ‌రుగుతుంది. అయితే కొన్ని ప్ర‌త్యేక‌మైన రంగులు, న‌మూనాలు కలిగిన వినాయ‌కుడి బొమ్మ‌లు, చిత్రాల‌ను ఇంట్లో ఒక ప్ర‌త్యేక స్థానంలో ఉంచి పూజిస్తే దాని వ‌ల్ల మ‌న‌కు ఇంకా ఎక్కువ ఫ‌లితం క‌లుగుతుంది. ఈ క్ర‌మంలో ఎలాంటి వినాయ‌కుల బొమ్మ‌ల‌ను పూజిస్తే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ని చేసే చోట‌
వ్య‌క్తులు తాము ప‌ని చేసే చోట గ‌ణేషుడు నిల‌బడి ఉన్న బొమ్మ‌ను పెట్టుకుంటే దాంతో ఎంతో పాజిటివ్ శ‌క్తి ల‌భిస్తుంది. ప‌నిలో ఉత్సాహం పెరుగుతుంది. ప‌ని ఒత్తిడి ద‌గ్గ‌ర‌కు చేర‌దు.

ఏ ప్ర‌దేశంలోనైనా
ఇల్లు లేదా ఆఫీస్ ఇలా ఏ ప్ర‌దేశంలోనైనా వ్య‌క్తులు కూర్చుని ఉన్న గ‌ణేష్ బొమ్మ‌ను, అందులోనూ ఎడ‌మ వైపు తొండం ఉన్న గ‌ణేష్ విగ్ర‌హాన్ని త‌మ ద‌గ్గ‌ర పెట్టుకుంటే దాని వ‌ల్ల ఎల్ల‌ప్పుడూ విజ‌యాలు క‌లుగుతాయి. అదృష్టం వ‌రిస్తుంది.

కేవ‌లం ఇంట్లోనే
తెలుపు రంగుతో కూడిన గ‌ణేష్ బొమ్మ‌ను లేదా విగ్ర‌హాన్ని భ‌క్తులు ఇంట్లో పెట్టుకుంటే దాని వ‌ల్ల ఇల్లంతా సంద‌డిగా ఉంటుంది. ఎల్ల‌ప్పుడూ సంతోషం నెల‌కొంటుంది.

పూజ గ‌దిలో
భ‌క్తులు త‌మ త‌మ పూజ గ‌దుల్లో ఒక‌టి క‌న్నా ఎక్కువ గ‌ణేష్ విగ్ర‌హాల‌ను పెట్ట‌కూడ‌దు. అలా చేస్తే వినాయ‌కుడి భార్య‌లైన సిద్ధి, బుద్ధిల‌కు ఆగ్ర‌హం వ‌స్తుంది.

ఎరుపు రంగు గ‌ణ‌ప‌తి
ఎరుపు రంగులో ఉండే గ‌ణ‌ప‌తి విగ్ర‌హం లేదా బొమ్మ‌ను పూజిస్తే అలాంటి వారికి ఎంతో అభివృద్ధి ఉంటుంది. తాము అనుకున్న రంగంలో ఎన‌లేని విజ‌యాలు సాధిస్తారు.

స్వ‌స్తిక్ గ‌ణేష్‌
స్వ‌స్తిక్ ఆకృతిలో మ‌ల‌చ‌బ‌డిన గ‌ణేష్ విగ్ర‌హాన్ని లేదా బొమ్మ‌ను పూజిస్తే అలాంటి ఇంట్లో వాస్తు దోషాల‌న్నీ తొల‌గిపోతాయి.

ల‌డ్డూ, ఎలుక‌తో
చేతిలో ల‌డ్డూ ఉండ‌డంతో పాటు ప‌క్క‌నే ఎలుక కూడా ఉన్న గ‌ణేషుని విగ్ర‌హం లేదా బొమ్మ‌ను ఇంట్లో పెట్టుకుంటే దాంతో ఇల్లంతా సంతోషం నెల‌కొంటుంది. అంద‌రి అభివృద్ధి జ‌రుగుతుంది. జీవితమంతా సుఖ‌మ‌యం అవుతుంది.
Loading...

Popular Posts