మిరపకాయ కేవలం కారం కోసమే కాదు.. పచ్చిమిరపలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి

వంటకమేదైనా స్పైసీ కోరుకునేవారు దీని నామస్మరణ చేయక తప్పదు. న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పచ్చిమిరపలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి.
 • పచ్చి మిరపకాయల్లో కేలరీలు సున్నా. ఇది నిజం. కానీ, కేలరీలకు మించి మనకు శక్తినిస్తాయి. ఎలా అంటారా... ఇందులో ఉండే రసాయనాలు జీవక్రియలను 50 శాతం వేగవంతం చేస్తాయి. పచ్చిమిరపకాయలను తిన్న తర్వాత మూడు గంటల పాటు ఈ ప్రభావం ఉంటుంది.
 • కేన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తాయి. దీంతో రక్షణ లభిస్తుంది. ప్రొస్టేట్ గ్రంధి సమస్యలకు పచ్చిమిరపకాయలు మంచి పరిష్కారం. 
 • గుండెకు పచ్చిమిరప రక్షణ కవచం అంటే నమ్ముతారా...? కానీ నమ్మి తీరాల్సిందే. ప్రమాదకర అథెరోస్కెల్ రోసిస్ ను నివారిస్తుంది. రక్తంలో కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయులను తగ్గించడం ద్వారా ధమనుల లోపల కొవ్వు ఏర్పడకుండా పచ్చిమిరపలోని రసాయనాలు అడ్డుకుంటాయి. అలాగే రక్తం గడ్డకట్టేందుకు దారితీసే ప్లేట్ లెట్ల సమూహం ఏర్పడకుండా కూడా నివారిస్తుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. 
 • మిరపకాయలు మంట ఎత్తిస్తాయన్న విషయం తెలుసు కదా. ఈ మంట ఎత్తించే రసాయనమే క్యాప్సేసియన్. ఇది బ్రెయిన్ లోని హైపోదాలమస్ అనే చల్లబరిచే కేంద్రాన్ని ప్రేరేపించడం ద్వారా బాడీ ఉష్ణోగ్రతను పెంచుతుంది.
 • జలుబు, సైనస్ ఉన్న వారికి పచ్చిమిరప మంచి సహజ ఔషధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే క్యాప్సేసియన్ ముక్కు లోపలి మ్యూకస్ మెంబ్రేన్లలను ఉత్తేజపరుస్తుంది. మెంబ్రేన్లకు రక్త సరఫరా మంచిగా జరిగేలా చూస్తుంది. మెంబ్రేన్ అనేది ఒక టిష్యూ. ఇందులో శ్లేష్మం (మ్యూకస్) ఏర్పడడాన్నే సైనస్ గా చెప్పుకోవచ్చు. క్యాప్సేసియన్ వల్ల రక్త సరఫరా మంచిగా జరిగి మెంబ్రేన్లలో శ్లేష్మం పల్చబడుతుంది. దీంతో ఉపశమనం లభిస్తుంది.
 • మిరపకాయలతో వచ్చే మంట నొప్పి ఉపశమనంగా పనిచేస్తుంది. అంతేకాదు, జీర్ణమవడానికి, మంట ఏర్పడకుండా ఉండేందుకు కూడా ఉపకరిస్తాయి. అయితే, పెప్టిక్ అల్సర్ ఉన్నవారు వీటికి దూరంగా ఉండడమే బెటర్. 
 • విటమిన్ సీ, బీటా కెరోటిన్ ఉండడం వల్ల పచ్చిమిరపకాయలు కంటి, చర్మ ఆరోగ్యానికి, రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి తోడ్పడతాయి. పచ్చిమిరపకాయలను చీకటిగా ఉండే, చల్లటి ప్రదేశంలోనే నిల్వ చేయాలి. వెలుగుకు, వేడికి, గాలికి ఎక్స్ పోజ్ కావడం వల్ల పచ్చిమిరపకాయల్లో ఉండే విటమిన్ సీ కోల్పోవడం జరుగుతుంది. 
 • మూడ్ బాలేదా, శరీరం అసౌకర్యంగా, నొప్పులుగా అనిపిస్తోందా...? అయితే, పచ్చిమిరపకాయలు లాగించండి. దీనివల్ల ఎండార్ఫిన్లు విడుదలై మంచి మూడ్ రావడానికి, నొప్పి ఉపశమనంగానూ పనిచేస్తాయి.
 • రక్తంలో షుగర్ స్థాయులను కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకే మధుమేహులు ప్రతిరోజు తమ ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి.
 • వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఐరన్ లోపం ఉన్న వారికి మిరప మంచి ఔషధం.
 • వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బాగానే ఉన్నాయి. అందుకే చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి. 
 • పచ్చిమిర్చిలో విటమిన్ K కూడ తగినంత ఉంటుంది. ఇది అస్టియోపోరోసిస్ రిస్క్ ను తగ్గించడమే కాకుండా బ్లీడింగ్ సమస్య లేకుండా చేస్తుంది.

Popular Posts

Latest Posts