ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు అసలు ఉల్లి చేసే మేలు ఏంటో మీరే తెలుసుకోండి

Loading...
ఉల్లిపాయ చేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత మనందరికి తెలిసిన విషయమే...మరి మన శరీరానికి ఎలాంటి మేలు చేస్తుందంటే... మనకు తెలిసో తెలియకో... ప్రతి రోజు ఆహారంలో ఉల్లిపాయను తీసుకుంటాం. మనం జబ్బు పడినప్పుడు లేదా త్వరగా నయం కావటానికి ఉల్లిపాయ మంచి ప్రత్యామ్నాయ మందు అని చెప్పవచ్చు. ఉల్లిపాయలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిని దాదాపుగా అన్ని వంటల్లోనూ వాడటం వల్ల ఉల్లిపాయలో ఉండే అనేక రసాయనాలు అనారోగ్యం బారిన పడకుండా...చేస్తాయి.

1. ఉల్లిపాయలో యాంటిబయోటిక్, ఏంటి సెప్టిక్, యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
2. ఉల్లిపాయలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువగా ఉంటాయి.
3. ఉల్లిపాయ రసంతో తేనె తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలెర్జీల వంటి సమస్యలకు తక్షణ ఉపశమనం కలుగుతుంది.
4. ఉల్లిపాయ ముక్కను నుదుటి మీద పెడితే జ్వరాన్ని తగ్గించుకోవచ్చు.
5. ఉల్లిపాయ ముక్క వాసనను పిల్చేతే, ముక్కు నుండి వచ్చే రక్త స్రావాన్ని ఆపుతుంది.
6. ఉల్లిపాయ నిద్రలేమి, నిద్ర రుగ్మతలను నయం చేయటంలో సహాయపడుతుంది.
7. జీర్ణక్రియ సమస్యలుఉన్నప్పుడు ఉల్లిపాయను తింటే జీర్ణ రసాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
8. ఉల్లిపాయ రసం కాలిన చర్మం నయం చేయటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
9. ఇది తల, మెడ మరియు పెద్దప్రేగు లో వచ్చే క్యాన్సర్ లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
10. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచటానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా మధుమేహ చికిత్సలో సహాయపడతాయి.
11. ప్రతి రోజు ఉల్లిపాయ తింటే గుండె వ్యాధులకు కారణం అయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.
12. నువ్వుల నూనె లేదా అముదంలో ఉల్లిపాయలను వేగించి ఉపయోగిస్తే ఒంటి నొప్పులు మాయం అవుతాయి.
15. ఉల్లిపాయ రసంలో పసుపు కలిపి ముఖానికి రాస్తే నల్లని పాచెస్ లేదా పిగ్మేంట్ తొలగించటానికి సహాయపడుతుంది.
16. ఉల్లిపాయ రసంను చెవి, కంటి సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
17. దంతాల నొప్పి ,పిప్పి పన్ను నొప్పి నివారణకు ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తారు.
18. కొన్ని రకాల పుట్టుమచ్చలను ఉల్లిరసం ఉపయోగించి సమర్ధవంతంగా తొలగించవచ్చు.
19. ఉల్లిపాయను ఉపయోగించటం వలన మంచి జ్ఞాపకశక్తి, ఒక బలమైన నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది.
20. ఉల్లిపాయ రసాన్ని తల మీద చర్మం మీద రాస్తే చుండ్రు , జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.
Loading...

Popular Posts