సిగరెట్ వలన ఓ లాభం కూడా ఉందండోయ్.. సిగరెట్ వలన ఉన్నఒకే ఒక లాభం ఏంటంటే..

సిగరెట్ వలన ఉన్నఒకే ఒక లాభం ఏంటంటే... ఇది కాలరీల ఇంటేక్ (తీసుకునే శాతం) తగ్గిస్తుంది. ఇది నిజంగా నిజం అని గ్రీస్ పరిశోధకులు చెబుతున్నారు. 14 మంది ఆరోగ్యకరమైన మగవారితో ఓ పరిశోధన చేశారు అథేన్స్ లోని హరోకోపియా యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు. వీరందరితో రెండు సిగరెట్లు తాగించారు.

45 నిమిషాల తరువాత వీరిని స్నాక్స్ తినమని చెప్పారు. ఆ సమయంలో వీరి ఆకలిని, తింటున్న విధానాన్ని దగ్గరగా గమనించారు పరిశోధకులు. ఆ తరువాత వారి బ్లడ్ శాంపిల్సు తోసుకోని ఒబెస్టాటిన్, ఘ్రెలిన్, జి ఎల పి 1 లాంటి హార్మోన్స్ లెవెల్స్ పై కన్నేశారు. వారి పరిశోధనలో తేలిందేమిటంటే .. సిగరెట్ ఆకలి పుట్టించే హార్మోన్స్ ని కంట్రోల్ చేస్తోంది. పరిశోధనలో పాల్గొన్న వారు దాదాపుగా 152 కాలరీలు తక్కువ తీసుకున్నారని చెప్పారు అధ్యయనం నిర్వహించినవారు.

Popular Posts

Latest Posts