చన్నీటి స్నానం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు గురించి తెలిస్తే.... ఎంత కష్టమైనా చన్నీళ్ళతోనే స్నానం చేస్తారు !!!

Loading...
చాలా మంది చల్లని నీటితో స్నానం చేయటానికి ఇష్టపడరు. కానీ చన్నీటి స్నానం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు గురించి తెలిస్తే.. చన్నీటికే ప్రాధాన్యత ఇస్తారు. చన్నీటి స్నానం వల్ల శరీర జీవక్రియ రేటు వేగంగా మారటంతో పాటు… రక్త ప్రసరణ బాగా జరిగి, రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది. వ్యాయామాల అనంతరం చన్నీటి స్నానం చేస్తే శరీర అలసట తగ్గి.. కండరాలకు విశ్రాంతి చేకూరుతుంది. ఉదయం బద్ధకంగా భావించేవారు చన్నీటి స్నానం చేస్తే రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

చన్నీటి స్నానం వలన సౌందర్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉన్నాయి. చల్లటి నీరు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చటమేకాకుండా, తలకు ఉండే దుమ్ము, ధూళి వంటి వాటిని తొలగించి… వెంట్రుకలను ఆకర్షణీయంగా కనబడేలా చేస్తుంది. విదేశీ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనల ద్వారా కనుగొన్న ఈ నిజాలను మన ఋషులు, పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే మనకి అందించటం కొసమెరుపు .
Loading...

Popular Posts