భోజనం ఎలా పడితే ఆలా చేయకూడదు. భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చోవాలి ? భోజనం చేసే ముందు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు

Loading...
హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి కార్యానికి ఒక అర్ధం పరమార్ధం ఉంటుంది. మానవ జీవితంలో ఎంతో ముఖ్యమైన దిన చర్య భోజనం చెయ్యడం. అయితే ప్రస్తుత కాలంలో భోజనం చెయ్యడం అనేది ఒక ఫాషన్ అయిపొయింది. నిలబడి తినడం అటు ఇటు తిరగడం ఇంకోన్నాళ్లు ఆగితే పరిగెడుతూ కుడా తింటారేమో. అయితే ఇలా చెయ్యడం వల్ల మన ఆరోగ్యం చాలా నాశనం అవుతుంది. అయితే ఎలా తినాలి ఏమిటి అంటే ఇదిగోనండి సమాధానం 
భోజనం చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు:-
  • మనం భోజనం తూర్పు, పడమర, ఉత్తర దిక్కులలో తిన్నచ్చు, కాని ఎట్టి పరిస్టితిలోను దక్షిణం చుస్తూ తినరాదు. 
  • ఇంటి పెద్ద ఖచ్చితంగా తూర్పు ముఖంగా కుర్చుని భుజించాలి, మిగతా కుటుంబ సబ్యులు దక్షిణం మినహా ఎటు అయిన తినవచ్చు. 
  • డైనింగ్ టేబుల్ ఎప్పుడు గుండ్రటి ఆకారంలో ఉండరాదు. అలాగే గుడ్డు ఆకారంలో కూడా ఉండరాదు డైనింగ్ టేబుల్ ని ఎప్పుడు మడిచి మూలన పెట్టడం లేదా గోడకి పెట్టడం చెయ్యకూడదు. 
  • ప్రధాన ద్వారానికి ఎప్పుడు ఎదురుగ ఎప్పుడు డైనింగ్ టేబుల్ పెట్టరాదు. 
  • భోజనం ఎప్పుడు ప్రశాంతంగా భోజనం చెయ్యాలి, అంతే కాని హడావుడిగా కాదు. 
  • అలాగే భోజనం చేసిన తరవాత ఒక 10 నిముషాలు కూర్చుని సేద తీరాలి.
  • భోజనం చేసేటప్పుడు మద్యలో లేగావడం కానీ, లేదా వేరొకర్ని లేపడం కాని చెయ్యరాదు అల చేస్తే మహా పాపం. 
  • మన ఆర్ధిక స్థితి ని బట్టి వీలైనంతలో నలుగురికి భోజనం పెట్టాలి అప్పుడే మనకు తృప్తి, ఆత్మ శాంతి.
Loading...

Popular Posts