ఉదయం సమయంలో ఖచ్చితంగా తినకూడని ఆహారాలు

Loading...
సాధారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో తీసుకొనే ఆహారాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెబుతారు. అందులో మన దినచర్యను హెల్తీ ఫుడ్స్ తో ప్రారంభించినట్లైతే, మన శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్లు, న్యూట్రీషియన్స్, విటమిన్లు పూర్తిగా బాడీ గ్రహించడం వల్ల ఆరోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా… ఎనర్జిటిక్ గా ఉంటారు . అయితే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను కూడా ఉదయం సమయంలో తీసుకోకూడదంటున్నారు ఆహార నిపుణులు, మరి అవేంటి?

మన ప్రతి రోజూ ఉదయం తీసుకొనే మొదటి ఆహారం మన శరీరానికి అవసరం అయ్యే ఇంధనం వంటిది. రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . మిమ్మల్ని అలసటక మరియు బద్దకానికి గురైనప్పుడు, అది కూడా ఉదయం సమయంలో ఇలాంటి ఫీలింగ్స్ కలిగినప్పుడు , ఇక ఆరోజంతా మగతగానే అనిపిస్తుంది. మరియు బ్రేక్ ఫాస్ట్ మీ ఆకలిని సాటిస్ఫై చేస్తుంది. అంతే కాదు మీరు తీసుకోనే ఉదయం అల్పాహారం మద్యహ్నాన భోజనం తీసుకొనే వరకూ మీకు ఆకలి అవ్వకుండా చేస్తుంది. దాంతో పాటు మీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది.

అయితే ఉదయం తీసుకొనే కొన్ని ఆహారాలు శరీరానికి ఒంటబట్టకు తిరిగి మిమ్మల్ని నిస్తేజంగా మార్చుతుంది. ఇంకా మీరు బరువు తగ్గించుకొనే ప్లాన్ లో ఉన్నప్పుడు మీరు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఎంపిక మీద జాగ్రత్తగా ఉండాలి . మరి బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం…
బ్రెడ్ అండ్ జామ్ :
చిన్న వయస్సు నుండి బ్రెడ్ అండ్ జామ్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఉదయం సమయంలో జామ్ తీసుకోవడం నిజంగా ఆరోగ్యానికి అంత మంచిది కాదు . జామ్ కు ప్రత్యామ్నాయంగా బ్రెడ్ అండ్ ఎగ్ తీసుకోవడం లేదా కేవలం గుడ్డు మాత్రమే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
స్వీట్స్ అండ్ డిజర్ట్స్ :
మీరు షుగర్ మరియు స్వీట్స్ కు వ్యసనపరులుగా మారిఉన్నా, ఉదయం మాత్రమే స్వీట్స్ మరియు డిజర్ట్స్ తీసుకోకూడదు. ఇలాంటి వాటిల్లో షుగర్స్ అధికంగా ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్ మరియు మైదాతో తయారుచేస్తారు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను అమాంతంగా పెంచేస్తుంది.
ప్రొసెస్డ్ మీట్ :
రోజులో ప్రొసెస్ చేసిన ఆహారాలు డేలో ఎప్పుడు తీసుకొన్నా ఆరోగ్యానికి హానికరమే . అదే విధంగా ఉదయం తీసుకోవడం కూడా హానికరమే. ప్రొసెస్ చేసిన మాంసాహారాల్లో నైట్రేట్స్ ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది.
మైదాతో చేసిన ఆహారం
మైదాతో తయారుచేసిన ఇతర ఏ పదార్థాలైనా సరే మార్నింగ్ తీసుకోవడం చాలా చెడు అలవాటుగా గుర్తించాలి. హెల్తీ ఫుడ్స్ ను ఎంపికచేసుకోవాలి.
గ్రెయినీ ప్రొడక్ట్స్ :
చాలా వరకూ సెరల్ ప్రొడక్ట్స్ గ్రెయిన్స్ తో తయారుచేసినవే . వీటిలో గ్లూటిన్ మరియు షుగర్స్ ఉంటాయి. కాబట్టి సెరెల్స్ ఉదయం తీసుకోవడం అంత ఆరోగ్యకరం కాదు.
బర్గర్ :
ఇంకా బర్గర్ వంటివి కూడా ఉదయం సమయంలో తీసుకోవడం కూడా చెడే.. చాలా మంది , ఈ మోడ్రన్ ప్రపంచంలో సమయం లేక ఇలాంటి రెడీ మేడ్ బర్గర్స్ ను పిక్ చేసుకుంటుంటారు. వీటి తయారీకి ఉపయోగించే ప్రిజర్వేటివ్స్ మరియు సాస్, ఆడిటివ్స్ వంటివి ఆరోగ్యానికి చాలా హానికలిగిస్తాయి.
జ్యూస్ :
ఫ్రూట్ జ్యూస్ లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. షుగర్ కంటెంట్స్ ఉన్నవి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ఒక బ్యాడ్ చాయిస్ అనే చెప్పుకోవచ్చు . అందుకు వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల మీకు అవసరం అయ్యే ఎనర్జీ, న్యూట్రీషియన్స్ ను పొందవచ్చు
Loading...

Popular Posts