ఒక్క ఉల్లిపాయతో ఇలా చేస్తే చాలు మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది

ఒక్క ఉల్లిపాయను తీసుకుని ఇలా వాడితే చాలు మీ ముఖం కాంతివంతమైన ఛాయతో మెరిసిపోతుంది. ఎందుకంటే ఉల్లిపాయలో ఉండే విటమిన్ సి, ఫ్లేవనయిడ్స్ రక్తాన్ని శుద్ది చేయడంతో పాటుగా రక్తాన్ని శరీరం అంతటా సరఫరా చేయటంలో సహాయపడతాయి. దీంతో రక్తం అన్ని భాగాలకు సక్రమంగా అందుతుంది. ఉల్లిపాయను రెగ్యులర్ గా తినడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ముఖంలో మెరుపు వచ్చేందుకు ఉల్లిపాయను ఇలా వాడాలి.
ముఖానికి ఇలా వాడాలి: 
  • ఒక బౌల్ లో 2 స్పూన్ల శనగపిండి, 
  • 2 స్పూన్ల ఉల్లిపాయ రసం, 
  • అర స్పూన్ పాలు, 
  • చిటెకెడు జాజికాయ పొడి, 
  • కొన్ని చుక్కల లావెన్డేర్ నూనె వేసి బాగా కలిపాలి.
  • ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • ఇలా 2వారాలు చేస్తే ముఖం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.
నల్లని మచ్చలు మరియు పిగ్మెంటేషన్ కి ఉల్లితో ఇలా చేయాలి:
  • ఉల్లిపాయ రసం నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగించటానికి సమర్ధవంతంగా పనిచేస్తుంది.
  • ఉల్లిపాయ రసంలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, ఫోటో న్యూ త్రియంత్స్ చర్మంలో మలినాలను తొలగించి పోషణను అందిస్తాయి. 
  • ఒక బౌల్ లో ఉల్లిపాయ రసం, పెరుగును సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి.
  • 10, 15 నిమిషాల పాటు సున్నితంగా వృత్తాకార కదలికలతో మసాజ్ చేయాలి. 
  • ఇలా 10 రోజుల పాటు రాస్తే ముఖంలో అనూహ్యమైన ఫలితాలు కనిపిస్తాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)