మీరు కూడా యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే ఈ విధంగా చేయండి

Loading...
ఇంటర్నెట్ వచ్చిన తరువాత ఎక్కువమంది దాన్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీన్ని ఆధారం చేసుకొని డబ్బులు సంపాదించే మార్గాలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. వాటిలో యుట్యూబ్ ఒకటి. దీనికి మీరు చేయాల్సిందల్లా మీ ఆన్ లైన్ ఫ్రెండ్స్ వీలైనంతగా పెంచుకోవడమే. అయితే యుట్యూబ్ ఉపయోగించి డబ్బు సంపాదిన్చుకోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
ముందుగా యుట్యూబ్ చానల్ సెటప్ చేసుకోండి:
ముందుగా యుట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక చానల్ ను సెటప్ చేసుకోండి. యుట్యూబ్ అకౌంట్ కూడా గూగుల్ అకౌంట్ వంటిదే. యుట్యూబ్ అకౌంట్ ద్వారా అన్ని గూగుల్ ప్రొడక్ట్స్ లోకి ఎంటర్ అవ్వొచ్చు.
యూజర్ నేం సింపుల్ గా ఉండేలా చూసుకోండి:
మీ యుట్యూబ్ చానల్ కు సంబంధించి యూజర్ నేం సింపుల్ గా సులువుగా గుర్తుపెట్టుకునే విధంగా చూసుకోండి.
హై క్వాలిటీ కంటెంట్ కు ప్రాధాన్యత:
మీ యు ట్యూబ్ చానల్ లో హై క్వాలిటీ కంటెంట్ అప్ లోడ్ చేయండి.
కంటెంట్ విభిన్నంగా ఆకర్షణీయంగా ఉండాలి:
మీరు అప్ లోడ్ చేసే కంటెంట్ కొత్తదిగాను ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోండి. వీడియోలను చిత్రీకరించేప్పుడు హై క్వాలిటీ కెమెరాలను ఉపయోగించండి.
కంటెంట్ ను రెగ్యులర్ గా అప్ డేట్ చేయాలి:
కంటెంట్ ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తుంటే మీ ప్రేక్షకుల సంఖ్యను పెంచుకోవచ్చు. కంటెంట్ అప్ లోడ్ చేయడానికి షెడ్యుల్ పాటించండి.
వీడియోకు తగ్గట్టుగా కీవర్డ్స్ జత చేయాలి:
మీరు పోస్ట్ చేసిన వీడియో కు సంబందించిన కీ వర్డ్స్ టాగ్ చేయాలి. అంతే కాకుండా అవీడియోకు సంబంధించి వివరణను జత చేస్తే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు.
సోషల్ మీడియా ప్రమోషన్:
మీ యుట్యూబ్ వీడియోలను కంటెంట్ ను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రమోట్ చేస్తుండాలి. ఇలా చేస్తుంటే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించవచ్చు.
కాపీ రైట్ కంటెంట్ ఉండకూడదు:
మీరు పెట్టే యుట్యూబ్ వీడియోలకు monetization ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన వాణిజ్య ప్రకటనలను మీ చానల్ లో పెట్టుకోవచ్చు. ఇలా ఉండాలంటే మీ కంటెంట్ ఏ విధమిన కాపీ రైట్ కంటెంట్ కాకూడదు.
యాడ్ సెన్స్ వెబ్ సైట్ లోకి వెళ్లి:
యాడ్ సెన్స్ అకౌంట్ గూగుల్ మనకు అందిస్తుంది. ఈ అకౌంట్ లోకి వెళ్లి మన యుట్యూబ్ చానల్ పేరుతొ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. వాడుకలో ఉన్న ఇ మెయిల్ అడ్రెస్ తో పాటు పే పాల్ అకౌంట్ గాని బాంక్ అకౌంట్ గాని జత చేయాల్సి ఉంటుంది. ప్రేక్షకులు మీ వీడియోలు చూడడం దాని మీద ఉండే యాడ్స్ క్లిక్ చేయడం ద్వారా కొంత మొత్తం డబ్బు మీ అకౌంట్ లో వచ్చి పడుతుంది.
గూగుల్ అనలిటిక్స్:
మీ చానల్ మెనూ లోని గూగుల్ అనలిటిక్స్ కు వెళ్లి మీ కంటెంట్ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కొత్త కొత్త ప్రణాలికలను సెట్ చేసుకోండి.
యుట్యూబ్ లో మాత్రమే కాదు:
మీ వీడియో లను యుట్యూబ్ లో మాత్రమే కాదు బ్లాగ్ లేదా వెబ్సైట్ లో కూడా పోస్ట్ చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు.
Loading...

Popular Posts