అందం, ఆకర్షణ మెరుగుపరచడంలో అరటిపండు చేసే అద్భుతం..! చర్మానికి, జుట్టుకి, శరీరానికి పోషణ అందించడంలో అరటిపండు బేష్

Loading...
అరటిపండును సౌందర్య పోషణకు ఎలా ఉపయోగించాలో తెలుసా ? ప్రతి ప్రాంతంలో, ఏ కాలంలోనైనా అందుబాటులో ఉండే అరటిపండు.. మీ స్కిన్ బెస్ట్ పార్ట్ నర్. అరటిపండు ఎక్కువ ఎనర్జీని అందిస్తాయి. ఒక అరటిపండు తినడం వల్ల.. చాలా సమయం.. ఎనర్జీ అందుతుంది. బ్రేక్ ఫాస్ట్ తినే సమయం లేని వాళ్లు.. అరటిపండు చక్కటి ఆప్షన్. బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం కంటే.. అరటిపండు తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. వీటి వల్ల హెల్త్ బెన్ఫిట్స్ మాత్రమే కాదు.. దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు సంరక్షణకు, చర్మ సౌందర్యానికి చక్కగా ఉపయోగపడుతుంది. అరటిపండు ఉపయోగించే.. అనేక హోం రెమిడీస్ న్యాచురల్ గా ఫాలో అవవచ్చు. అరటిపండులో మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. చర్మానికి, జుట్టుకి, శరీరానికి పోషణ అందించడంలో అరటిపండు బేష్.

మొటిమల మచ్చలు:
అరటిపండు తొక్కను ఉపయోగించే.. ఇన్ల్ఫమేషన్ తగ్గించడమే కాకుండా.. మొటిమలకు కారణమయ్యే బ్యాక్లీరియాను నాశనం చేయవచ్చు. అరటితొక్క లోపలి భాగంతో.. రుద్దితే చాలు.

యాంటీ ఏజింగ్:
అరటిపండ్లు.. న్యాచురల్ గా ముడతలు, ఫైన్ లైన్స్ తొలగించడానికి సహాయపడతాయి. గుజ్జుగా చేసిన అరటిపండు, నిమ్మరసం, పెరుగు కలిపి.. ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇది న్యాచురల్ యాంటీ ఏజింగ్ లా పనిచేస్తుంది.

మాయిశ్చరైజర్:
అరటిపండులో పొటాషియం, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి మాయిశ్చరైజర్ లా పనిచేస్తాయి. మెత్తగా చేసిన అరటిపండు గుజ్జుని ముఖమంతా పట్టించాలి. 10 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకుంటే.. చర్మం సాఫ్ట్ గా మారుతుంది.

ఆయిల్ కంట్రోల్:
అరటిపండు గుజ్జుకి తేనె, నిమ్మరసం కలిపి ఫేస్ కి ప్యాక్ లా అప్లై చేయడం వల్ల.. చర్మంలో అదనపు ఆయిల్ ని కంట్రోల్ చేయవచ్చు.


నిర్జీవమైన చర్మానికి:
అరటిపండ్లలో ఉండే విటమిన్ సి.. గ్లోయింగ్ స్కిన్ అందించడంలో సహాయపడుతుంది. అరటిపండును గుజ్జులా చేసి.. నిమ్మరసం, గంధం కలిపి ముఖానికి పట్టించడం వల్ల డల్ స్కిన్ ని గ్లోయింగ్ గా మార్చవచ్చు.

కళ్లకు:
అరటిపండు గుజ్జుని ఉదయం నిద్రలేచిన తర్వాత కళ్ల కింద రాసుకోవాలి. అరటిపండు చల్లగా ఉంటే మరింత ప్రయోజనకరం. ఈ న్యాచురల్ రెమెడీ.. ఉదయాన్నే డల్ లుక్ ని మార్చడంలో సహాయపడుతుంది.

డార్క్ సర్కిల్స్:
అరటిపండు తొక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి.. తర్వాత కళ్ల కింద పెట్టుకుంటే.. డార్క్ సర్కిల్స్ నివారించవచ్చు. వారానికి కనీసం రెండుసార్లు ఇలా చేస్తే.. డార్క్ సర్కిల్స్ ని ఒకనెలలోపే తగ్గించుకోవచ్చు.

డ్రై హెయిర్:
అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వల్ల.. డ్రై హెయిర్ నివారించడానికి సహాయపడుతుంది. అరటిపండును గుజ్జుగా చేసి.. తేనెలో మిక్స్ చేసి.. జుట్టుకి అప్లై చేస్తే.. కండిషనర్ గా పనిచేస్తుంది.

పసుపు పళ్లకు:
అరటిపండు తొక్క లోపలి భాగాన్ని పళ్లపై రుద్దడం వల్ల అవి తెల్లగా మెరిసిపోతాయి. ప్రతిరోజూ రాత్రి ఇలా చేయాలి. పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్.. పళ్లు గ్రహించి.. తెల్లగా మారడానికి సహాయపడుతుంది.
Loading...

Popular Posts