ఆధార్ కార్డుని సింపుల్ గా ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

Loading...
కొత్తగా ఆధార్ కార్డ్ కోసం 'Apply' చేసుకున్నారా..?, మీకో గుడ్ న్యూస్!. సాధారణంగా ఆధార్ కార్డుకు ధరఖాస్తు చేసుకున్న వారికి, వారి ఆధార్ కార్డ్ పోస్ట్ ద్వారా పంపబడుతుంది.

కొంత మందికి పోస్ట్‌లో రావటం ఆలస్యమవుతుంది. ఇలాంటి సందర్బాల్లో ఆధార్ కార్డ్‌ను నేరుగా ఆన్‌లైన్ నుంచే డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఇంటర్నెట్ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లో ఆధార్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు పలు సలువైన మార్గాలను ఇక్కడ సూచించటం జరుగుతోంది...

అవసరమైన ప్రాథమిక అంశాలు.. ఇంటర్నెట్ ద్వారా ఆధార్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలు.. మీ ఆధార్‌కు సంబంధించిన Enrollment ID.ఆధార్ రిజిస్ట్రేషన్ సందర్భంగా మీకిచ్చిన Acknowldgement form పై ఈ ఐడీ ఉంటుంది. అలానే మీ పేరు, యారియా పిన్ కోడ్, ఆధార్ రిజిస్ట్రేషన్ సందర్భంగా మీరిచ్చిన మొబైల్ నెంబర్.

స్టెప్ 1 ముందుగా ఆధార్‌కు సంబంధించిన అధికారిక వైబ్‌సైట్ UIDAIలోకి లాగిన్ అవ్వండి. వెబ్‌సైట్ లింక్ https://eaadhaar.uidai.gov.in/

స్టెప్ 2 లింక్ ఓపెన్ అయిన తరువాత మీకు స్కీన్ పై బాగంలో Aadhaar No (UID), Enrolement No (EID) పేర్లతో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో Enrolement No (EID)ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 3 కనిపించే ఆప్షన్‌లలో ఆధార్ రిజిస్ట్రేషన్ సందర్భంగా మీకిచ్చిన Acknowldgement form పై ఉన్న విధంగా Enrollment Number , Resident Name(ఆధార్ కార్డు కోసం మీరు దరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరు ) , Area Pin Code, Capcha text ఇంకా మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.

స్టెప్ 4 వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని Get One Time Password పై క్లిక్ చేయండి.

స్టెప్ 5 ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ మెసేజ్ రూపంలో అందుతుంది.

స్టెప్ 6 ఆ OTPని క్రింది సెక్షన్‌లో ఎంటర్ చేసి Validate&Download పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ అయిపోతుంది అయిపోతుంది.

స్టెప్ 7 PDF ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు password అడుగుతుంది, Area Pin Code ఎంటర్ చేస్తే చాలు. మీ ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది.

ఆన్‌లైన్‌లో మీ ఆధార్ నెంబర్ తెలుసుకోవటం ఏలా..?

స్టెప్ 1 ముందుగా https://resident.uidai.net.in/find-uid-eid లింక్‌లోకి వెళ్లండి.

స్టెప్ 2 స్కీన్ పై బాగంలో Aadhaar No (UID), Enrolement No (EID) పేర్లతో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో Aadhaar No (UID) ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 3 తరువాతి స్టెప్‌లో భాగంగా ఆధార్ రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ కార్డు కోసం మీరు ధరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి.

స్టెప్ 4 తరువాతి స్టెప్‌లో భాగంగా ఆధార్ కార్డు కోసం మీరిచ్చిన మెయిల్ లేదా ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.

స్టెప్ 5 ఆ తరువాత క్రింది బాక్సులో కనిపించే సెక్యూరిటీ కోడ్‌ను ఏలా ఉందో అలానే ఎంటర్ చేయండి.

స్టెప్ 6 Get OTP ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 7 ఇప్పుడు మీ మెయిల్ లేదా మొబైల్ నెంబర్ కు OTP అందుతుంది.

స్టెప్ 8 మీ మొబైల్ లేదా మెయిల్ కు అందిన OTPని Enter OTP* అనే బాక్సులో టైప్ చేసి verifiy OTP పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ మీ మొబైల్‌కు పంపబడుతుంది.
Loading...

Popular Posts