ఆడవాళ్ల నోటిలో రహస్యాలు దాగవు ఎందుకో తెలుసా? తెలిస్తే పడి పడి నవ్వుతారు

Loading...
రహస్యం అంటేనే గుట్టుగా ఉంచేదని అర్థం. కొన్ని ర‌హ‌స్యాలనైతే కొందరు జీవితాంతం వరకు రెండో కంటికి తెలియనివ్వరు. కానీ ఇంకొంద‌రు అలా కాదు, ఏదైనా ఓ కొత్త ర‌హ‌స్యం తెలిస్తే చాలు దాన్ని ఇత‌రుల‌కు చెప్ప‌డంలో ఎక్కడ లేని ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారు. అయితే సాధార‌ణంగా కేవ‌లం ఆడ‌వారికి మాత్ర‌మే ఇలా ర‌హ‌స్యాల‌ను బ‌య‌టికి చెప్పే అల‌వాటు ఉంటుంద‌ని అంటూ వస్తుంటారు. అయితే కొందరు మగవాళ్లకూ ఈ లక్షణం ఉంటుందన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ఆడవాళ్ల నోటిలో రహస్యాలు దాగవని స‌మాజంలో పాతుకుపోవ‌డం అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం.. 

దీనికి సంబంధించి ఓ బ్రిటిష్ ప‌రిశోధ‌న బృందం ప‌లు ప‌రిశోధ‌న‌లు కూడా చేసింది. ఏ మ‌హిళ అయినా త‌న‌కు ఏదైనా ర‌హ‌స్యం తెలిస్తే దాన్ని 32 నిమిషాల క‌న్నా ఎక్కువ సేపు త‌న‌లో ఉంచుకోద‌ని, వెంట‌నే దాన్ని ఇత‌రుల‌కు చెప్పేస్తుంద‌ని వెల్లడైంది. అయితే మ‌గ‌వారు కాకుండా కేవ‌లం ఆడ‌వారే ర‌హ‌స్యాల విష‌యంలో ఎందుకు ఇలా చేస్తార‌నే దానిపై స్ప‌ష్టత లేద‌ట‌. కొంద‌రు మ‌హిళ‌లు ర‌హ‌స్యాల‌ను తెలుసుకోవాల‌నే ఉత్సాహంతో వాటిని చెప్పేస్తుంటే, కొంద‌రు ఇత‌రుల‌కు తెలియ‌ని ర‌హ‌స్యాలు త‌మ‌కే తెలిశాయ‌న్న గొప్ప ఫీలింగ్ క‌ల‌గ‌డం కోసం ర‌హ‌స్యాల‌ను వెంట‌నే చెప్పేస్తున్నార‌ట‌.

ఇంకొంద‌రికైతే ర‌హ‌స్యాల‌ను ఎక్కువ రోజుల పాటు దాచి పెట్టి ఉంచితే వారిలో మాన‌సిక ఒత్తిడి తీవ్ర‌త‌ర‌మై అది భ‌రించ‌లేక ర‌హ‌స్యాల‌ను చెప్పేస్తున్నార‌ట‌. ఇక ర‌హ‌స్యాల‌ను చెప్ప‌డం విష‌యంలో పురుషుల దాకా వ‌స్తే వారు కూడా ర‌హ‌స్యాల‌ను చెప్పే సంద‌ర్భాలు కొన్ని ఉన్నాయట‌. అవేమిటంటే, రిలాక్స్‌గా ఉన్న‌ప్పుడు, మ‌ద్యం సేవించిన‌ప్పుడు. ఆ రెండు సంద‌ర్భాల్లోనూ వారు కూడా ర‌హ‌స్యాల‌ను చెప్పేస్తార‌ట‌.
Loading...

Popular Posts