మీ స్థోమత బట్టి పెద్దదో చిన్నదో ఇంట్లో ఫిష్ ఎక్వేరియం పెట్టుకోండి.. దోషాలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీతో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం పొందుతారు

పెద్ద పెద్ద కార్యాలయాలు, స్టార్ హోటల్స్, షాపింగ్ మాల్స్, ప్రముఖుల ఇళ్లకు వెళ్లినప్పుడు మనకు ఫిష్ అక్వేరియం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఫిష్ అక్వేరియం పెట్టుకోవడంలో కొంత శాస్త్రీయత ఉండగా దీని వెనుక బలమైన నమ్మకాలు ఉన్నాయి. ఏదైనా ఆఫీస్, షాపు, ఇంటికి సంబంధించి ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా నివారణగా ఒక ఫిష్ ఎక్వేరియం పెట్టుకోవాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. సంపద శక్తిని గ్రహించేందుకు పవర్ ఫుల్ గా దోహదం చేస్తుందని కూడా స్పష్టం చేస్తుంది. అయితే ఎవరి స్థోమతకు తగ్గట్టుగా వారు ఎక్వేరియం సైజును నిర్ణయించుకోవచ్చు. చిన్నదైనా, పెద్దదైనా ఫలితాలు మాత్రం ఒకేరకంగా ఉంటాయి. ఇంకా ఫిష్ అక్వేరియం ఉంటే కలిగే లాభాలు తెలుసుకుందాం..   
అక్వేరియం పెట్టుకోవడం కలిగే లాభాలు:
  • చేప ఆక్వేరియం మీ ఇంటి నుంచి మొత్తం చెడును బయటకు పంపటానికి, నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహాయపడుతుంది.
  • ఇంటిలో లేదా ఆఫీస్ వద్ద సంపద యొక్క శక్తిని ఆకర్షించడానికి ఇది ఉత్తమ మార్గాలలో ఒకటి.
  • కొద్దిసేపు అక్వేరియం వైపు తదేకంగా చూస్తే మనసుకు ప్రశాంతమైన, అహ్లాదకరమైన భావన కలుగుతుంది. కొత్త శక్తి వస్తుంది. టెన్షన్స్ పోతాయి.
  • ఇల్లు, ఆఫీసుల్లో సమస్యలు, వాస్తు లోపాలుంటే చేపల అక్వేరియం పెట్టుకోవడం ఉత్తమమైన మార్గం. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు సైతం సమసిపోతాయి.
  • చేపలు ఆహారం తింటూ ఉంటే మీ ఇంటిలో చెడు పోయి మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
  • చేపలు దాదాపు రోజు మొత్తం ఉత్సాహంగా ఉండి, చూపరులను ప్రోత్సహిస్తాయి.
  • అక్వేరియం ఉన్న ఇంటికి ఎవరైనా సందర్శకులు వస్తే వారి దృష్టి ఇంటిపై పడకుండా మళ్లిస్తుంది.
  • వివిధ రంగుల్లో ఉండే అక్వేరియం చేపలు పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. అవి చెడు శక్తులను పారదోలడంలో శక్తిమంతంగా పనిచేస్తాయి.
  • వాస్తు ప్రకారం ఇల్లు, ఆఫీసుకు సంబంధించిన బరువును బ్యాలెన్స్ చేయడానికి అక్వేరియం దోహదం చేస్తుంది. అందుకే దక్షిణం - పడమర మూలలో అక్వేరియం ఉంచాలని శాస్త్రం చెబుతోంది. అయితే అది సందర్శకులు ప్రముఖంగా చూసే ప్రాంతం అయివుండాలి.
  • అక్వేరియంలో చేపలు వేగంగా తిరుగుతున్న ఫలితంగా ఆ ఇంటిలోని వారికి మంచి ఆరోగ్యం, సిరి సంపదలు లభిస్తాయని చైనీస్ ఫెంగ్ షుయ్ సిద్ధాంతం చెబుతోంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)