జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శత్రుగండాన్ని పోగెట్టే సులువైన మార్గం.. ఇలా చేస్తే అందరూ మీ పట్ల ఆకర్షితులవుతారు.. శత్రువులనే వారు ఉండరు

Loading...
ప్ర‌పంచ‌మ‌న్నాక అందులో మ‌న‌కు అంద‌రూ స్నేహితులు, శ్రేయోభిలాషులే ఉండ‌రు. శ‌త్రువులు కూడా ఉంటారు. అయితే కాలక్ర‌మంలో కొంద‌రు సన్నిహితులు శ‌త్రువుల్లా, శ‌త్రువులు స్నేహితుల్లా మారిపోవ‌చ్చు. అది వేరే విషయం. కానీ కొంద‌రికైతే ఆజ‌న్మాంతం, ఆ మాట‌కొస్తే ఇంకా కొంద‌రికి త‌ర‌త‌రాల వ‌ర‌కు శ‌త్రువులు ఉంటారు. కొంద‌రికి త‌మ ఆస్తి వ‌ల్లో, చేసే వ్యాపారాలు ఇత‌ర ప‌నుల వ‌ల్లో శ‌త్రువులు ఏర్ప‌డుతుంటారు. అయితే శ‌త్రువులు ఎలా ఏర్ప‌డినా, ఉన్నా శ‌త్రుశేషం మాత్రం ఉంచుకోవ‌ద్ద‌ని పురాణాలు చెబుతున్నాయి. మ‌న పెద్ద‌లు కూడా ఇదే విష‌యాన్నిఎప్ప‌టి నుంచో చెబుతూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ఎలాంటి గొడ‌వ‌ల‌కు దిగ‌కుండా, దాడి చేయ‌కుండా మ‌న‌కున్న శత్రుశేషాన్ని సులభంగా తొల‌గించుకునేందుకు కూడా పురాణాల్లో ప‌లు ప‌ద్ధ‌తులు ఉన్నాయి. వాటిని గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.
  • చ‌క్కెర‌, ధ‌నియాలు, మిరియాలు మూడింటిని కొద్ది భాగంలో స‌మ పాళ్ల‌లో తీసుకోవాలి. అనంత‌రం వాటిని క‌లిపి పొడి చేసి తాజా నీటిలో క‌ల‌పాలి. ఆ నీటిని ఇంట్లో ఉన్న తుల‌సి లేదా రావి చెట్టు, అవి రెండూ లేవంటే ఏదైనా ఇత‌ర దేవ‌తా వృక్షం మొద‌ట్లో పోయాలి. ఇలా వారం రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో మీకున్న శ‌త్రు శేషం పూర్తిగా పోతుంది. అయితే నీటిని మ‌నం వాడుతున్న‌వి కాకుండా తాజాగా ప‌ట్టిన వాటిని తీసుకోవాలి.
  • ఒక అర‌టి ఆకు తీసుకుని దాని మీద బియ్య‌పు పిండి పోయాలి. దానిపై గరిక ప‌ర‌చాలి. అనంత‌రం దానిపై కుంకుమ‌, ప‌సుపు వేయాలి. మ‌ట్టి ప్ర‌మిద‌లో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని సాక్షాత్తూ విఘ్నేశ్వ‌రుడిగానే భావిస్తూ అష్టోత్త‌ర పూజ చేయాలి. ఇలా వారం రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల శ‌త్రు పీడ‌లు, శ‌త్రు శేషం, గండాలు తొల‌గిపోతాయ‌ట‌. జ్యోతిష్య శాస్త్రంలో ఈ విష‌యం గురించి పేర్కొన్నారు.
Loading...

Popular Posts