డెంగీ జ్వరం లక్షణాలు మరియు నివారణ చర్యలు... డెంగీ జ్వరం ఉన్నప్పుడు ఆ టాబ్లెట్స్ అస్సలు వాడకూడదు

  • డెంగీ అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. డెంగీకి ప్రత్యేకమైన మందులు లేవని, లక్షణాలను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుందని అల్లోపతి వైద్యులు పేర్కొంటున్నారు. ఏ వైద్య విధానంలోనైనా డెంగీకి పెద్ద చికిత్స లేదని, దీనికి కూడా సాధారణ జ్వరంలాగా నే వైద్యం చేయాలంటున్నారు. వైద్య నిపుణుల సలహా మేరకు సరైన సమయంలో చికిత్స అందించాలి.
  • డెంగీ లక్షణాలు... 
  • జ్వరం విపరీతంగా ఉంటుంది. దాదాపు 104 ఫారెన్‌హీట్‌.
  • తీవ్రమైన తలనొప్పి, చలి, ఒళ్లునొప్పులు
  • కళ్లలో విపరీతమైన నొప్పి
  • శరీరంపై దద్దర్లు
  • వాంతులు కావడం, కడుపునొప్పి
  • నోరు ఆరిపోవడం, విపరీతమైన దాహం
  • కొన్ని సందర్భాల్లో జ్వరం తీవ్రతను బట్టి రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది.
  • ఏం చేయాలి...? 
  • చలితో విపరీతమైన జ్వరం వచ్చిన వెంటనే అనుభవం ఉన్న వైద్యులను కలవాలి.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ యాస్ర్పిన్‌, బ్రూఫిన్‌ మాత్రలు వాడకూడదు.
  • జూప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు రక్తం గడ్డకట్టి పని ఆగిపోతుంది. అందుకే డెంగీ జ్వరం ఉన్నప్పుడు నొప్పుల నివారణ కోసం ఎన్‌ఎస్‌ఏఐడీ ఉన్న మాత్రలు వాడకూడదు.
  • పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రో‌లైట్స్‌ అధికంగా ఉన్న ద్రవాలను మాత్రమే తీసుకోవాలి.
  • ప్లేట్‌లెట్స్‌ జీవిత కాలం ఒక్కరోజే. అది శరీరంలో నిరంతరం ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. డెంగీ జ్వరం ఉన్నప్పుడు శరీరంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతాయి. అలాంటప్పుడు వైద్యుల సలహా మేరకు అవసరం అయితేనే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాలి.
  • జ్వరం వచ్చిన వెంటనే చల్ల నీళ్లతో శరీరం అంతా బాగా తుడవాలి. చల్లని ప్రదేశంలో రోగిని పడుకోబెట్టాలి. పారాసెట్మాల్‌ మాత్రను వెంటనే ఇప్పించాలి. శరీర ఉష్ణోగత్ర తగ్గేందుకు చేయాల్సిన అన్ని చర్యలు చేయాలి.
  • దోమలు నివారించడానికి ఇంట్లో కాయిల్స్‌, లిక్విడ్‌ లాంటివి వాడాలి. దోమకాటు లేకుండా దోమ తెరలు వాడాలి.
  • డెంగీ నివారణకు నెటిజన్ల సూచనలు 
  • డెంగీ నివారణకు నెటిజన్లు తమదైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తున్నా రు. ఫేస్‌బుక్‌, వాట్స్‌అ్‌పలో డెంగీ, దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన గృహ చిట్కాలను అందరికీ చేరవేస్తున్నారు. అందులో కొన్ని... 
  • నిమ్మకాయను రెండు భాగాలుగా కోసి అందులోని ఒక్కో భాగంలో 10-15 లవంగాలను అందులో గుచ్చాలి. దీంతో డెంగీ దోమలు ఆ ప్రాంతంలోకి రావు.
  • బొప్పాయి ఆకును తుంచి బాగా కడిగి వాటిని కలకండతో కలిపి కొన్ని నీళ్లు పోసి, మిక్సీ పట్టాలని. వచ్చిన ఆ మిశ్రమాన్ని వడగట్టి గంటకో గ్లాసు చొప్పున డెంగీ బాధితుడికి తాపిస్తే డెంగీ లక్షణాలు పూర్తిగా మాయం అవుతాయి.
  • క్యారెట్‌ జ్యూస్‌, చీనీ రసం, కొబ్బరి బోండం నీళ్లు బాగా తాగిస్తే తొందరగా కోలుకునే అవకాశం ఉంది.
  • కొబ్బరి నూనెను పాదాల నుంచి మోకాళ్ల దాకా బాగా పూయాలి. ఇది యాంటి బయోటిక్‌గా పనిచేస్తుంది. డెంగీ దోమను దగ్గరికి రాకుండా కాపాడుతుంది.

Popular Posts

Latest Posts