మీకు నచ్చిన దేవుడి ఫొటోలతో పాటు ఖచ్చితంగా ఈ దేవుని ఫోటోలు పెట్టుకోవాలి అప్పుడే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి

Loading...
దేవుని పూజ గదిలో కొంతమంది కొన్ని ఫోటోలు పెట్టుకుంటారు ఇంకొంతమంది వేరే ఫోటోలు పెట్టుకుంటారు, ఇలా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు పెట్టుకుంటారు.
కానీ మీకు నచ్చిన దేవుడి ఫొటోలతో పాటు ఖచ్చితంగా ఈ దేవుని ఫోటోలు పెట్టుకోవాలి అని ఆదిశంకరాచార్యులువారు క్షుణ్ణంగా చెప్పారు. ఆ వివరాలు మీ కోసం.
విఘ్నాలు తొలగించే గణపతి
మన మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తి అవ్వడానికి గణపతి ఫోటో ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి.
శక్తిని ప్రసాదించడానికి అమ్మవారు
ఆది పరాశక్తి, జగన్మాత అయిన అమ్మవారి ప్రతిమ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి.
సృష్టి మూల స్థంబాలు శివుడు విష్ణువు
శివుడు విష్ణువు లేనిదే ప్రపంచమే లేదు అందుకే ఖచ్చింతంగా ఈ రెండు ఫోటోలు ఉండాలి.
సూర్యనారాయణ (సూర్యుడు) ఫోటో
సూర్యనారాయణ ప్రతిమ లేదా ఫోటో ఖచ్చితంగా ఉండాలి అని శంకరాచార్యులు వారు సూచించారు.
కుల/గ్రామ దేవత /దేవుని ఫోటో
కొంతమందికి వాళ్ళ గ్రామ దేవతనే కుల దేవత లేదా కుల దేవుడు ఉంటారు వాళ్ళ ఫోటోలు కూడా ఖచ్చితంగా ఉండాలి.
Loading...

Popular Posts