మీకు ఆకలి వేస్తుందా ? అది మంచి ఆకలేనా లేదా చెడ్డ ఆకలా ? మంచి ఆకలైతే పర్వాలేదు కానీ చెడ్డ ఆకలైతే కొంచెం తిన్న బరువు పెరిగిపోతారు

Loading...
సాధార‌ణంగా ఏ జీవికైనా ఆక‌లి ఒకే ర‌కంగా ఉంటుంది. కాక‌పోతే జంతువులు, ప‌క్షులు, మ‌నుషులు తినే ఆహారం వేరుగా ఉంటుంది. అది వేరే విష‌యం. అయితే ప్ర‌ధానంగా మ‌నుషుల విష‌యానికి వ‌స్తే మ‌న‌కు ఆక‌లి భిన్న‌మైన ర‌కాల్లో ఉంటుంద‌ట. అదేంటీ, ఆక‌లంటే ఆక‌లేగా, ఎవ‌రికైనా ఆక‌లి ఒక‌టే విధంగా ఉంటుంది, ఆక‌లైతే ఆహారం తింటారు, మ‌ర‌లాంట‌ప్పుడు ఆక‌లి భిన్న‌మైన ర‌కాల్లో ఉండ‌డ‌మేమిటి..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..! అయినా మేం చెబుతోంది నిజ‌మే. ఎందుకంటారా..? అది ఎందుకో తెలుసుకోండి..!

ప‌లువురు సైంటిస్టులు చెబుతున్న దాని ప్ర‌కారం మ‌న‌కు ఆక‌ల‌వుతుందంటే అందుకు కార‌ణం ఆహారం తిన‌మ‌ని కాద‌ట‌. ఆ ఆక‌లికి కార‌ణం వేరే ఏదో ఉంటుంద‌ట‌. కానీ చాలా మంది ఆక‌ల‌వుతుందంటే ఆహారం తీసుకుని పొట్ట నింపుకుంటారు. దీంతో శ‌రీరంలో అధికంగా క్యాల‌రీలు చేరి బ‌రువు పెరుగుతారు. 
మ‌రి ఆక‌లి అయిందంటే అది ఆహారం వ‌ల్లో, దేని వ‌ల్లో గుర్తించ‌డం ఎలా..? 
ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మ‌నుషులు ఎవ‌రైనా దాదాపు రోజుకు 3 పూట‌లు తింటారు. కొంద‌రు ఇంకా ఎక్కువే తింటారు లెండి. అది వేరే విషయం. అయితే మ‌నం 3 పూటలా ఎందుకు తింటున్నామంటే ఆ టైముకు ఆక‌లి అవుతుంది కాబ‌ట్టి తింటాం. ఒక భోజ‌నానికి, మ‌రో భోజ‌నానికి మ‌ధ్య సుమారు 4 నుంచి 6 గంట‌ల గ్యాప్ వ‌స్తుంది కాబ‌ట్టి స‌హ‌జంగానే మ‌నం అంత‌కు ముందు తిన్న ఆహారం జీర్ణం అయి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు ఆక‌లి వేస్తుంది. అందుకు అనుగుణంగానే ఆహారం తింటాం. కానీ కొంద‌రికి ఆ 3 పూటలా కాకుండా వాటి మ‌ధ్య స‌మ‌యాల్లో కూడా ఆక‌లి అవుతుంది. అది ఎప్పుడంటే కోపంగా ఉన్న‌ప్పుడు. అవును, అప్పుడే. 

  • బాగా కోపంగా ఉన్న‌ప్పుడు కొంద‌రికి ఆక‌లి అవుతుంద‌ట‌. దీంతో వారు స‌హ‌జంగానే తిండి వైపు మొగ్గు చూపుతార‌ట‌. అయితే మీకు గ‌న‌క కోపంగా ఉన్న‌ప్పుడు ఆక‌లైతే వెంట‌నే ఆహారం తిన‌కండి. ముందు కొద్దిగా నీరు తాగండి. అయినా ఆక‌లి పోక‌పోతే ఉడ‌కబెట్టిన శ‌న‌గ‌లో, మొల‌కలో లేదంటే న‌ట్స్‌, యాపిల్స్ వంటి పండ్ల‌ను తినండి. దీంతో శ‌రీరంలో అద‌న‌పు క్యాల‌రీలు చేర‌వు. బ‌రువు కూడా పెర‌గ‌కుండా ఉంటారు.
  • శ‌రీరంలో ఉన్న నీటి శాతం త‌గ్గుతున్నా కొంద‌రికి ఆక‌లి అవుతుంది. ఈ క్ర‌మంలో అలాంటి వారికి ఎవ‌రికైనా ఆక‌లి అవుతుందంటే ముందుగా కొంత నీరు తాగి 15 నిమిషాల వ‌ర‌కు వెయిట్ చేయాలి. అప్పుడు ఆక‌లి తీరిపోతే అది నీటి శాతం త‌గ్గ‌డం వ‌ల్లే అని తెలుసుకోవాలి. ఆ క్ర‌మంలో నీటిని రోజంతా తాగుతూ ఉంటే ఆక‌లి కాకుండా ఉంటుంది.
  • బోర్ కొట్ట‌డ‌మ‌నేది చాలా మందికి మామూలే. అయితే ఇలాంటి స్థితిలో ఉన్న కొంద‌రికి కూడా ఆక‌లి బాగా అవుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో అలాంటి స్థితిలో ఉన్న వారు ఒక గ్లాస్ నీరు తాగాలి. లేదంటే ఒక చూయింగ్ గ‌మ్ న‌మలాలి. లేదా ఏదైనా పుస్త‌కం చ‌ద‌వ‌డ‌మో, వాకింగ్ చేయ‌డ‌మో చేయాలి. దీంతో బోర్ కొట్ట‌డం త‌గ్గుతుంది. ఆక‌లి కూడా కాదు.
  • చాలా ఎక్కువ స‌మ‌యం పాటు టీవీ చూసే వారికి కూడా ఆక‌లి బాగా అవుతుంద‌ట‌. ఇలాంటి వారు జంక్ ఫుడ్‌కు బ‌దులుగా పండ్లు, క్యారెట్‌, కీర‌, బీట్‌రూట్ వంటి స‌హ‌జ సిద్ధ‌మైన ఆహారం తింటే దాని వ‌ల్ల మైండ్ రిఫ్రెష్ అయి ఆక‌లి త‌గ్గుతుంద‌ట‌.
  • డిప్రెష‌న్‌లో ఉన్న వారు, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న ఎక్కువ‌గా ఉన్న వారికి కూడా ఆక‌లి బాగా అవుతుంద‌ట. ఈ క్ర‌మంలో వారు సంతోషంగా ఉంటే ఆక‌లి అవ‌డం త‌గ్గుతుంద‌ట‌. ఏవైనా ఆనందం క‌లిగించే విష‌యాలు విన‌డ‌మో, కామెడీ సీన్స్ చూడ‌డ‌మో, బుక్స్ చ‌ద‌వ‌డ‌మో చేస్తే ఆక‌లి బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. డిప్రెష‌న్‌, ఒత్తిడి కూడా త‌గ్గుతాయి.
  • ఇప్పుడు అస‌లైన ఆక‌లి ఎలా ఉంటుందో చూడండి. మీకు నిజంగా ఆక‌లి అవుతుంటే నీరు తాగినా, చిన్న‌పాటి ఆహారం ఏమి తిన్నా ఇంకా ఆక‌లిగానే ఉంటుంది. ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు ప‌డిపోతూ నీర‌సంగా ఉంటుంది. త‌ల‌నొప్పి, క‌డుపునొప్పి, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇవి అస‌లైన ఆక‌లికి చిహ్నాలు. కాబ‌ట్టి న‌కిలీ ఆక‌లికి, అస‌లు ఆక‌లికి తేడా తెలుసుకుంటే ఆ ప్ర‌కారంగా మీరు శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.
Loading...

Popular Posts