ముఖంపై పెదాల‌పై, ఏర్ప‌డే అవాంఛిత రోమాల‌ను ఈ సుల‌భ‌మైన టిప్స్‌ ను పాటిస్తే పోతాయి

Loading...
అందంగా క‌నిపించాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి. నేటి త‌రుణంలో మ‌హిళ‌లే కాదు పురుషులు కూడా అందంగా క‌నిపించాల‌ని కోరుకుంటున్నారు. అయితే వారి సంగ‌తి ప‌క్క‌న పెడితే ప్ర‌ధానంగా మ‌హిళ‌లు అందంగా క‌నిపించ‌డంలో ఎదుర్కొంటున్న ముఖ్య స‌మ‌స్య అవాంఛిత రోమాలు. స‌హ‌జంగా ఇవి ఏ మ‌హిళ‌ల‌కైనా వ‌స్తాయి. కానీ కొంద‌రిలో మ‌రీ ఎబ్బెట్టుగా ఉండి అందాన్ని దెబ్బ తీస్తాయి. దీంతో వాటిని తొల‌గించుకోవడం త‌ప్ప‌నిస‌రి. లేదంటే అంద విహీనంగా క‌నిపిస్తారు. అయితే కింద ఇచ్చిన కొన్ని సుల‌భ‌మైన టిప్స్‌ను పాటిస్తే అవాంఛిత రోమాల‌ను మ‌హిళ‌లు సుల‌భంగా తొల‌గించుకోవచ్చు. ప్ర‌ధానంగా పెదాల‌పై, ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలైతే ఇట్టే తొల‌గిపోతాయి. ఈ క్ర‌మంలో ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
  • శ‌న‌గ‌పిండి అర క‌ప్పు, పాలు అర క‌ప్పు, ప‌సుపు 1 టీస్పూన్‌, క్రీం 1 టీస్పూన్ తీసుకోవాలి. ఒక చిన్న‌పాటి పాత్ర‌ను తీసుకుని అందులో ముందు చెప్పిన ప‌దార్థాల‌న్నింటినీ బాగా క‌ల‌పాలి. అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని 25 నిమిషాల పాటు దాన్ని అలాగే వ‌దిలేయాలి. పూర్తిగా డ్రై అయ్యాక గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేసుకోవాలి. త‌ర‌చూ ఇలా చేయ‌డం వ‌ల్ల అవాంఛిత రోమాలు పూర్తిగా తొలగిపోతాయి.
  • పొట్టు తీసి బాగా న‌లిపిన ఆలుగడ్డ 1, కంది ప‌ప్పు 1 క‌ప్పు, నిమ్మ‌ర‌సం 4 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఆలుగ‌డ్డ‌ను బాగా న‌లిపి జ్యూస్ తీయాలి. కందిప‌ప్పును రాత్రంతా నీటిలో నాన‌బెట్టి వాటిని పేస్ట్‌లా చేయాలి. ఇప్పుడు ఆలుగ‌డ్డ జ్యూస్‌, కందిప‌ప్పు పేస్ట్‌, నిమ్మ‌ర‌సం, తేనెల‌ను అన్నింటినీ తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప‌ట్టించాలి. పూర్తిగా డ్రై అయ్యాక గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. దీని వ‌ల్ల కూడా అవాంఛిత రోమాల‌ను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.
Loading...

Popular Posts