ఎవ్వరి చేతిలో మోసపోకుండా ఉండాలంటే చాణక్యుడు చెప్పిన అద్భుతమైన ట్రిక్స్ - విజ‌యం మీ సొంత‌మ‌వుతుంది

  • అన్ని పాములు విషాన్ని క‌లిగి ఉండ‌వు. వాటిలో విషం లేనివి కూడా కొన్ని ఉంటాయి. అయితే అవి కూడా విషం ఉన్న పాముల్లాగే ప్ర‌వ‌ర్తిస్తాయి. మ‌నుషులు కూడా ఇలాంటి ప్ర‌వృత్తిని అల‌వాటు చేసుకుంటే ఆఫీసు రాజ‌కీయాల్లో పై చేయిని సాధించ‌వ‌చ్చ‌ట‌.
  • ఉద్యోగులెవ‌రైనా త‌మ తమ ర‌హ‌స్యాల‌ను గురించి ఇత‌రుల‌తో చ‌ర్చించ‌కూడ‌దు. వాటిని ఇత‌రుల‌కు అస్స‌లు తెలియ‌నీయ‌కూడ‌దు. లేదంటే ఇత‌రులు వాటితో పై చేయి సాధించేందుకు అవ‌కాశం ఉంటుంది.
  • ఈగో ఉన్న వారితో మ‌ర్యాద‌గా ఉంటూ, తెలివి ఉన్న వారితో ఎల్ల‌ప్ప‌టికీ నిజ‌మే చెబుతూ, మూర్ఖుల‌తో ఎప్ప‌టికీ వాదించ‌కుండా ఉంటుంటే వారు మీ ప‌ట్ల ఆస‌క్తి చూపుతారు. విజ‌యం మీ సొంత‌మ‌వుతుంది.
  • ఎవ‌రైనా ఏదైనా ప‌ని చేసే ముందు 3 ప్ర‌శ్న‌ల‌ను మ‌న‌స్సులో వేసుకోవాలి. అవేమిటంటే, 1. నేను ఈ ప‌నిని ఎందుకు చేస్తున్నాను? 2. దీని ఫ‌లితం ఎలా ఉంటుంది? 3. ఇది విజ‌య‌వంతం అవుతుందా? అనే ప్ర‌శ్న‌ల‌ను వేసుకుంటే, వాటికి సంతృప్తిక‌ర స‌మాధానాలు ల‌భించాయి అనుకుంటే అప్పుడు ఆ ప‌నిని మొద‌లు పెట్టాలి.
  • ఎవరైనా ఏదైనా ప‌ని చేస్తున్న‌ప్పుడు దాని గురించి భ‌య ప‌డ‌కూడ‌దు. మ‌ధ్య‌లో వ‌దిలేయ కూడ‌దు. చివ‌రి వ‌ర‌కు ప‌ని చేస్తేనే అలాంటి వారు సంతోషంగా, సంతృప్తిక‌రంగా ఉంటారు.
  • బహిరంగ ప్ర‌దేశాల్లో, ప‌బ్లిక్ ఎక్కువ‌గా ఉన్న చోట మీ శ‌త్రువులపై ఎక్కువ‌గా కోపాన్ని ప్ర‌ద‌ర్శించ కూడ‌దు.
  • ఇత‌రులు చేసిన త‌ప్పుల నుంచి మ‌నం ఎల్ల‌ప్పుడూ గుణపాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. లేదంటే మ‌నం జీవితంలో ఎక్కువ కాలం మ‌న‌గ‌ల‌గ‌లేం.
  • ఏ వ్య‌క్తి అయినా మ‌రీ అత్యంత నిజాయితీ ప‌రుడై ఉండ‌కూడ‌దు. నిటారుగా ఎదిగే చెట్ల‌నే ఎక్కువ‌గా న‌రుకుతారు క‌దా.
  • బంగారం ఎంత‌టి అస‌హ్యంలో ప‌డినా దాన్ని క‌డిగి మ‌ళ్లీ తీసుకోవాలి. అలాగే ఎంత త‌క్కువ స్థాయిలో, పేద‌రికంలో జ‌న్మించినా ప్ర‌తిభ ఉన్న వ్య‌క్తి నుంచి జ్ఞానాన్ని సంపాదించాలి.
  • యువ‌త‌, మ‌హిళ‌ల అంద‌మే ప్ర‌పంచానికి అత్యంత పెద్ద ప‌వ‌ర్ లాంటివి. చ‌దువు అనేది ప్ర‌తి మ‌నిషికి అత్యంత ఆవ‌శ్య‌కం. చదువుకున్న వ్య‌క్తిని అందరూ గౌర‌విస్తారు. ప్ర‌తి ఒక్క చోట అత‌నికి గౌర‌వం ద‌క్కుతుంది. యువ‌త‌, మ‌హిళ‌ల అందం క‌న్నా చ‌దువే ముఖ్య‌మైంది.
  • ప్ర‌తి ఫ్రెండ్‌షిప్ వెనుక ఏదో ఒక వ్య‌క్తిగత స్వార్థం లేదా ప్రేర‌ణా శ‌క్తి దాగి ఉంటుంది. ఇది న‌మ్మ‌లేని చేదు నిజం.

Popular Posts

Latest Posts