కలలో ఈ 9 కనిపిస్తే త్వరలోనే మీకు మంచి జరుగుతుందని సంకేతం.. అదృష్టం ధనం కలసివస్తుందని నమ్మకం

మనందరికీ కలలు వస్తుంటాయి. అందులో మంచివి ఉంటాయి, చెడ్డవీ ఉంటాయి. కొన్ని కలలు వచ్చాయంటే వాటి వెనక కొన్ని ప్రత్యేక కారణాలుంటాయి. ఆ కలల వెనక కొన్ని ఆశ్చర్యకర రహస్యాలుంటాయి. వస్తువులు, జంతువులు, మనుషులు, బంధువులు.. ఇలా కలలో ఏమేమో దర్శనమిస్తుంటాయి. ప్రత్యేకంగా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువే కలలో కనిపించిందంటే దానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. కలలో కనిపించేవన్నీ భ్రమ అని కొందరు భావిస్తారు. కానీ మనకు కలలు వస్తున్నాయంటే భవిష్యత్ కి లేదా తర్వాత రోజు జరగబోయే వాటికి సంకేతాలని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే మీ కలలో ఇప్పుడు చెప్పబోయేవి కనిపించాయి అంటే మీకు త్వరలోనే డబ్బు వస్తుందని, ధనవంతులు అవుతారని సూచనలు.
సూర్యుడు:
కలలో సూర్యుణ్ణి చూశారంటే త్వరలోనే మీకు కొంత ధనం రాబోతుందని సంకేతం. అంతేకాదు చాలా బ్రైట్ లైట్ తో సూర్యుడు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ జీవితం అత్యంత డబ్బుతో నిండిపోతుంది. అంటే ధనవంతులు అవుతారని సంకేతం.
చంద్రుడు:
కలలో సూర్యుడి లాగే చంద్రుడు కనిపించినా త్వరలోనే ధనవంతులు అవుతారని సంకేతం. చంద్రుడు అంటేనే ప్రశాంతతకు సంకేతం. కాబట్టి మీలో కోపం తగ్గుతుందని కూడా సూచిస్తుంది.
జుట్టు రాలినట్టు:
నిజ జీవితంలో జుట్టు రాలిపోవడం పెద్ద సంగతేం కాదు. కలలో మాత్రం మీ జుట్టు రాలుతున్నట్టు చూశారంటే త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతారని సంకేతం.
రెడీ అవుతున్నట్టు:
సాధారణంగానే మనమందరం రెడీ అవుతూ ఉంటాం. అయితే కలలో మీరు రెడీ అవుతున్నట్టు కనిపించినా, మీ ముఖం అందంగా కనిపించినా మీరు త్వరలోనే సంపన్నులు అవుతారని సంకేతం.
పర్స్:
కలలో పర్స్ కనిపించిందంటే త్వరలోనే మీకు కావాల్సినంత డబ్బు సొంతమవుతుందని సూచిస్తుంది.
ఆవు:
ఆవు పాలు ఇస్తున్నట్టు కలలో కనిపిస్తే త్వరలో సంపన్నులవుతారని సంకేతం
బంగారు నగలు:
బంగారం ధరించినట్టు కలలో కనిపిస్తే బంగారం, డబ్బు త్వరలోనే మీ జీవితంలోకి వస్తాయని సంకేతం.
అద్దాలు:
పగిలిన అద్దాలు కలలోకి వస్తే మాత్రం మంచిది కాదు. అయితే ప్లెయిన్, అందమైన అద్దాలు కలలో కనిపిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారని సంకేతం.
పాయసం:
బియ్యం, పాలు, పంచదారతో తయారు చేసిన పాయసంను కలలో చూశారంటే త్వరలోనే ధనవంతులు అవుతారని సంకేతం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)