రక్తంలో హీమోగ్లోబిన్ లెవల్స్ మరియు ఎర్రరక్త కణాల సంఖ్యను ను పెంచే 9 సూపర్ ఫుడ్స్

Loading...
  • ఆకుకూరలు: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనీమియాతో పోరాడుతుంది. ఆకుకూరల్లో విటమిన్ ఎ, బి9, సి మరియు ఇ, ఐరన్, ఫైబర్, క్యాల్షియం, బీటా కెరోటీన్స్ వంటి న్యూట్రీషియన్స్ అత్యధికంగా ఉన్నాయి. వాస్తవానికి న్యూట్రీషియన్స్ కు ఆకుకూరలు ఒక పవర్ హౌస్ వంటిది. ఉడికించిన ఆకుకూరలను అరకప్పు తిన్నా సరే మహిళ శరీరానికి అసవరమయ్యే 20 శాతం ఐరన్ ను పొందుతారు .
  • టమోటోలు : టమోటోల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది ఐరన్ ను గ్రహిస్తుంది. టమోటోల్లో ఉండే లైకోపిన్ వ్యాధులను నివారిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ కు సంబంధించిన అనీమియా వంటి వ్యాధులతో పోరాడుతుంది. టమోటోల్లో బీటాకెరోటిన్ మరియు విటమిన్ ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్ మరియు హెయిర్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. పచ్చిటమోటోలు, టమోటో జ్యూస్ , ఉడికించిన టమోటోలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.
  • బీట్ రూట్ : అనీమియాతో పోరాడటానికి బీట్ రూట్ అద్భుతంగా సమాయపడుతుంది. బీట్ రూట్ లో ఐరన్ కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ రిపేర్ చేయడానికి శరీరంలోని ఇతర భాగాలను ఆక్సిజన్ సప్లై చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . కాబట్టి రెగ్యులర్ డైట్ లో పచ్చి బీట్ రూట్ తినడం, సలాడ్స్ గా తయారుచేసుకని తినడం లేదా ఇతర వెజిటేబుల్స్ కు కలిపి జ్యూస్ చేసి తాగాలి.
  • దానిమ్మ: దానిమ్మలో ఐరన్ మరియు విటమిన్ సిలు అత్యధింగా ఉన్నాయి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది హీమోగ్లోబిప్ పెంచడంలో మరియు అనీమియా లక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో దానిమ్మ జ్యూస్ చేర్చుకోవడం చాలా అవసరం.
  • గుడ్డు : హీమోగ్లోబిన్ ను పెంచడంలో మరో సూపర్ ఫుడ్ గుడ్లు. గుడ్డులో ప్రోటీన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. అనీమియాతో బాధపడే వారు గుడ్డు తినడం వల్ల శరీరంలో విటమిన్స్ నిల్వచేయడానికి సహాయపడుతాయి. ఒక గుడ్డులో ఒక మిల్లీ గ్రామ్ ఐరన్ ఉంటుంది. రోజూ ఒక ఉడికించిన గుడ్డును తినడం వల్ల అనీమియాను దూరం చేస్తుంది. ఉడికించిన లేదా హాఫ్ బాయిల్ చేసి ఏదో ఒక రకంగా గుడ్డును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
  • రెడ్ మీట్: రెడ్ మీట్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోకి చాలా సులభంగా చొచ్చుకుపోతుంది. రెడ్ మీట్ కిడ్నీలు, హార్ట్, లివర్ వంటి వాటిలో ఐరన్, విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. మూడు ఔన్సు ల ఉడికించిన మాంసాహారం 1.25మిల్లీ గ్రాముల హెమె ఐరన్ అందిస్తుంది. రెండు మూడు రోజులకొకసారి హెమ్ ఐరన్ తినడం వల్ల అనీమియా నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.
  • సోయా బీన్స్: ఐరన్ మరియు విటమిన్స్ కు మరో గ్రేట్ సోర్స్ సోయా బీన్ , సోయా బీన్స్ లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ. ఇందులో ప్రోటీన్స్ అత్యధికంగా ఉంటాయి. అనీమియాను తగ్గిస్తుంది. సోయాబీన్స్ ను ఇంటివద్దే తయారుచేసుకోవడం వల్ల పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు . సోయాబీన్స్ ను వేడి నీటిలో రాత్రంతా నానబెట్టుట వల్ల అందులో ఉండే ఫైటిక్ యాసిడ్ కంటెంట్ ఐరన్ గ్రహించడాన్నితగ్గిస్తుంది.
  • ఆపిల్స్ మరియు డేట్స్: శరీరంలో ఐరన్ లెవల్స్ పెంచడానికి సహాయపడుతాయి. ఆపిల్స్ లో విటమిన్ సి, నాన్ హెమ్ (మొక్కల లేదా గ్రీన్ లీఫ్స్ )నుండి శరీరం ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. రోజూ ఆపిల్స్ మరియు డేట్స్ తినడం వల్ల అనీమియాకు వ్యతిరేఖంగా పోరాడుతుంది.
  • సీఫుడ్: శరీరంలో హీమోగ్లోబిన్ పెంచడానికి సీఫుడ్ గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాను నివారించడంలో ఫిష్ గ్రేట్ సూపర్ ఫుడ్. సాల్మన్, తున వంటి ఫ్యాటీ ఫిష్ లలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇటువంటి ఫుడ్స్ ను వారంలో కనీసం ఒకటి రెండు సార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల అనీమియాకు వ్యతిరేఖంగా పోరాడుతుంది.
Loading...

Popular Posts