డేంజర్: ఎట్టి పరిస్థితుల్లో ఈ 9 ఆహారాలను పచ్చిగా తినకూడదు.. ఒక వేళ పచ్చిగా తింటే.. తర్వాత తర్వాత.. ఆరోగ్యానికి తీవ్రమైన హాని

Loading...
  • కొన్నిరకాల ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితుల్లో పచ్చిగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ పచ్చిగా తింటే.. తర్వాత తర్వాత.. ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తాయని సూచిస్తున్నారు. కొన్నింటిని పచ్చిగా తింటేనే టేస్టీగా ఉంటాయి. కానీ.. అలా తినకూడని ఆహారాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.. 
  • మొలకెత్తిన గింజలు మొలకెత్తిన గింజల్లో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఇమ్యునిటీని దెబ్బతీస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వేధిస్తాయి. కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి.. కాస్త ఫ్రై చేసుకుని మొలకెత్తిన గింజలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
  • టమోటాలు టమోటాలలో గ్లికోలక్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి ఎసిడిటీని పెంచుతాయి. కాబట్టి సలాడ్స్ టమోటాలను చేర్చుకోవాలి అనుకుంటే.. కాస్త వేయించి తీసుకుంటే.. సైడ్ ఎఫెక్ట్స్ కి దూరంగా ఉండవచ్చు.
  • గ్రీన్ వెజిటబుల్స్ గ్రీన్ వెజిటబుల్స్ లో ఆక్సిలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరం ఐరన్, క్యాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది. కాబట్టి వీటిని కాస్త ఉడికించి తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. విటమిన్స్ పొందవచ్చు.
  • మష్రూమ్స్ మష్రూమ్స్ లో కార్సినోజెనిక్ ఉంటుంది. ఇది శరీరంలో హైటాక్సిన్ లెవెల్స్ కి కారణమవుతుంది. అలాగే ఇవి చాలా మాయిశ్చరైజర్ కండిషన్స్ లో మొలుస్తాయి. కాబట్టి వీటిని పచ్చిగా తినడం రిస్క్ అవుతుంది. అందుకే.. వీటిని ఉడికించి తీసుకుంటే మంచిది.
  • ఆల్మండ్స్ బాదాంలో సియనైడ్ ఉంటుంది. వీటిని పచ్చిగా తీసుకుంటే.. ఇన్ల్ఫమేటరీ, క్యాన్సర్ కి కారణమవుతాయి. కాబట్టి వీటిని నీళ్లలో నానబెట్టి తీసుకోవాలి. లేదా కాస్త రోస్ట్ చేసి తీసుకోవాలి.
  • పచ్చి పాలు పాలల్లో బ్రూసెల్లా, లిస్టేరియా ఉంటాయి. వీటిని పచ్చిగా తీసుకోవడం చాలా హానికరం. పచ్చిగా తాగడం వల్ల డయేరియా, పొట్టనొప్పి, వాంతులు, శరీరంలో మలినాలు పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి.. వీటిని మరిగించిన తర్వాతే తీసుకోవాలి.
  • పచ్చి గుడ్లు పచ్చి కోడిగుడ్లలో సల్మోనెల్లా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్స్ ని పెంచుతుంది. కాబట్టి.. పచ్చిగా ఎట్టిపరిస్థితుల్లో తినకూడదు. ఉడికించి మాత్రమే తీసుకోవాలి.
  • జీడిపప్పు జీడిపప్పులో ఉరుషియోలా టాక్సిన్ ఉంటుంది. వీటిని పచ్చిగా తింటే.. స్కిన్ ఎలర్జీ, పొట్టనొప్పి వస్తాయి. కాబట్టి వీటిని కాస్త రోస్ట్ చేసి తీసుకుంటే.. టేస్ట్ తోపాటు, హెల్తీ కూడా.
  • మాంసం పచ్చి మాంసంలో సల్మోనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. దీన్ని పచ్చిగా తీసుకోవడం వల్ల డయేరియా, తలనొప్పి, జ్వరంకు కారణమవుతుంది. కాబట్టి మాంసాన్ని ఉడికించి లేదా ఫ్రై చేసి మాత్రమే తీసుకోవాలి.
Loading...

Popular Posts