నెలకు 8 kg లు బరువు తగ్గించే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్.. తయారీ విధానం చాలా సింపుల్

Loading...
బరువు పెరిగితే తగ్గేవరకూ బాధపడుతూ ఉంటారు. కానీ సులభంగా బరువు తగ్గించే ఆహారం తీసుకోవడంలో మాత్రము అంతగా మార్పులు చేసుకోలేకపోతున్నాము. కొందరు ప్రొద్దుట లేచి మొలకెత్తిన విత్తనాలు తినాలి, ఓట్స్, ఫ్రూట్స్ అంటూ రకరకాలుగా చెప్తుంటారు. వీటిలో ఏది నిజమో దేని వల్ల ప్రయోజనం ఉంటుందో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. అయితే మంచి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తయారుచేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
బరువు తగ్గించే బ్రేక్ ఫాస్ట్ చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు.
కావల్సిన పదార్థాలు :
ఓట్ మీల్స్ : 2 టేబుల్ స్పూన్లు
ఫ్లాక్స్ సీడ్స్(అవిసె గింజలు ) : 2 టేబుల్ స్పూన్లు
లో ఫ్యాట్ మిల్క్ : 3 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
ఫ్లాక్ సీడ్స్ మరియు ఓట్స్ ను గోరువెచ్చగా వేయించి, పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ ను పాలలో వేసి ఉడికించుకోవాలి. అంతే బరువు తగ్గించే బ్రేక్ ఫాస్ట్ రిసిపి రెడీ. దీనికి షుగర్ లేదా ఇతర ఫ్లేవర్ స్వీట్నర్స్ ను చేర్చకూడదు. ప్రతి రోజూ ఉదయం దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఈ హోం మేడ్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. మెటబాలిజం రేటు పెంచుతుంది. ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటిని మెరుగుపరుస్తుంది.
Loading...

Popular Posts