మీ ఇంట్లో ఈ 7 వస్తువులు ఉంటే ఇంట్లో అంద‌రూ ఆరోగ్యంగా ఉంటారు పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది

Loading...
ఏ వ్య‌క్తి అయినా త‌న ఇంట్లో అంద‌రూ ఆరోగ్యంగా ఉండాల‌నే కోరుకుంటాడు. దీంతోపాటు ఐశ్వ‌ర్యం కూడా ల‌భించాల‌ని ఆరాట ప‌డ‌తాడు. అందుకే ఈ భూ ప్ర‌పంచంలో అవి స‌రిగ్గా ఉన్నవారే అస‌లైన ధ‌న‌వంతులుగా గుర్తించ‌బ‌డ‌తారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క వ్య‌క్తి త‌న‌, త‌న కుటుంబ స‌భ్యుల ఆరోగ్యం కోసం, త‌మ‌కు ధ‌నం క‌ల‌గ‌డం కోసం అంత‌గా శ్ర‌మిస్తుంటారు. అయితే ఫెంగ్ షుయ్ వాస్తు సిద్ధాంతం ప్రకారం కొన్ని టిప్స్‌ను పాటిస్తే వారి ఇంట్లో అంద‌రూ ఆరోగ్యంగా ఉంటార‌ట‌. అంతేకాదు వారికి ఎల్ల‌ప్పుడూ ధ‌నం ల‌భిస్తుంద‌ట‌. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
  • ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద విండ్ చైమ్స్ అని పిల‌వ‌బ‌డే వ‌స్తువుల‌ను క‌ట్టాల‌ట‌. దీంతో అవి ఎల్ల‌ప్పుడూ శ‌బ్దం చేస్తూ ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీని తీసుకువ‌స్తాయ‌ట‌. అంతేకాదు ఇంటి ప్ర‌ధాన ద్వారానికి అద్దాల‌ను ఏర్పాటు చేస్తే దుష్ట శ‌క్తులు రావ‌ట‌. కాంతి బాగా ప్రసార‌మై శ‌క్తి లభించి అనారోగ్యాలు దూర‌మ‌వుతాయ‌ట‌.
  • ఇంట్లో రోజ్‌మేరీ మొక్క‌ను పెంచుకోవాల‌ట‌. దీని వ‌ల్ల ఇంట్లో ఎల్ల‌ప్పుడూ ప్ర‌శాంతంగా ఉంటుంద‌ట‌. ఇంటికి ర‌క్ష‌ణ కూడా ల‌భిస్తుంద‌ట‌.
  • ఇంట్లో ఏదైనా గోడ‌కు మ‌హా స‌ముద్రంతో కూడిన బొమ్మ‌ను, ఫొటోను, పెయింటింగ్‌ను వేలాడ దీయాలి. దీని వ‌ల్ల ధ‌నం నీళ్ల‌లాగా ఇంట్లోకి వ‌స్తుంద‌ట‌.
  • పిల్ల‌న‌గ్రోవి లేదా ఇత‌ర ఏదైనా సంగీత వాయిద్యాన్ని ఇంట్లో పెట్టుకోవాల‌ట‌. దీంతో జీవిత‌మంతా సుఖ సంతోషాల‌తో కొన‌సాగుతుంద‌ట‌. ఎవ‌రైనా అనుకున్న ల‌క్ష్యాలు కూడా నెర‌వేరుతాయ‌ట‌.
  • తెలుపు రంగులో ఉండే స్ఫ‌టికాల‌ను ఇంట్లో పెట్టుకోవాల‌ట‌. వీటి వ‌ల్ల ఎంతో పాజిటివ్ శ‌క్తి ఇంట్లోని వారికి ల‌భిస్తుంద‌ట‌.
  • ఇంటి ప్ర‌ధాన ద్వారానికి ముందు వెల్‌క‌మ్ మ్యాట్‌ను పెట్టాలి. దీని వ‌ల్ల ఆ ఇంట్లో ఉన్న వారంద‌రికీ అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ట‌.
  • కిటికీల ద‌గ్గ‌ర చిన్న‌పాత్ర‌లో ఏ లోహంతో చేసినవైనా నాణేలు వేసి ఉంచాల‌ట‌. దీని వ‌ల్ల ఆ ఇంట్లోకి ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డుతుంద‌ట‌.
Loading...

Popular Posts