చేతి వేళ్లను ఈ 6 భంగిమలలో (ముద్రలు) పెట్టండి…ఇక ఏ వ్యాధి మీ దగ్గరకు రాదు.!

Loading...
చేతి వేళ్ల‌ను కొన్ని ప్ర‌త్యేక‌మైన భంగిమ‌ల్లో పెట్టి కొంత‌సేపు ధ్యానం చేయ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.  


శూన్య ముద్ర‌…
ప‌ద్మాసం వేసి కూర్చుని చేతుల‌ను రెండింటినీ కాళ్ల‌పై పెట్టుకోవాలి. అనంత‌రం రెండు చేతుల బొట‌న వేళ్ల‌ను మ‌ధ్య‌వేలికి బొమ్మ‌లో ఇచ్చిన విధంగా ఆనించాలి. ఇలా కొంత సేపు ఉండి ధ్యానం చేయాలి. దీంతో చెవి నొప్పి, చేతులు, కాళ్ల‌లో స్ప‌ర్శ జ్ఞానం కోల్పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.
జ్ఞాన ముద్ర‌…
పైన చెప్పిన‌ట్టుగానే పద్మాస‌నంలో కూర్చున్నాక రెండు చేతుల బొట‌న వేళ్ల‌ను చూపుడు వేళ్ల కొన‌ల‌కు ఆనిచ్చి ఉంచాలి. ఈ భంగిమ‌లో కొంత సేపు ఉండాలి. దీని వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరానికి ఉత్తేజం, ఉల్లాసం క‌లుగుతుంది.
పృథ్వి ముద్ర‌…
రెండు చేతుల ఉంగ‌ర‌పు వేళ్ల‌ను వాటి కొన‌ల వ‌ద్ద బొట‌న వేళ్ల‌తో ప‌ట్టుకోవాలి. ఇలా కొంత సేపు ఉండ‌డం వ‌ల్ల కండ‌రాలు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి. కొత్త కండ‌రాల రూప‌క‌ల్ప‌న జ‌రుగుతుంది. కండ‌రాలు రిలాక్స్ అవుతాయి.
వ‌రుణ ముద్ర‌…
రెండు చేతుల‌కు చెందిన చిటికెన వేళ్ల‌ను బొట‌న వేలి వైపుగా కింద‌కి వంచి బొట‌న‌వేళ్ల‌కు ఆనించాలి. ఇలా కొంత సేపు ఉండ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, డీహైడ్రేష‌న్ వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.
ఆకాశ‌ ముద్ర‌…
రెండు చేతుల బొట‌న వేళ్ల కొన‌ల‌కు మ‌ధ్య వేలి కొన‌ల‌ను ఆనించి కొంత సేపు ఉండాలి. దీని వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న దూర‌మ‌వుతాయి. నెగెటివ్ శ‌క్తి న‌శిస్తుంది. శ‌రీరంలోని విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి.
సూర్య ముద్ర‌…
రెండు చేతుల ఉంగ‌ర‌పు వేళ్ల‌ను పూర్తిగా కింద‌కి మ‌లిచి వాటిపై బొట‌న వేళ్ల‌ను ఉంచాలి. దీని వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. బ‌రువు త‌గ్గుతారు. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.
Loading...

Popular Posts