ఈ 6 లక్షణాలు నేర్చుకుంటే సక్సెస్ గ్యారెంటీగా సాధించవచ్చని చాణుక్యుడు చెప్పాడు

Loading...
ప్రతీ మనిషీ జీవితంలో సక్సెస్ కావాలని నిరంతరం తాపత్రపడుతుంటాడు. అందుకోసం ఎంతో శ్రమిస్తుంటాడు. వాటిలో కొన్ని విజయవంతం అవుతాయి, మరికొన్నింటికేమో అవాంతరాలు ఎదురవుతాయి. కాని ఈ పోరాటంలో ఓడినా గెలిచినా మనిషి ఎన్నో నేర్చుకుంటాడు. గెలుపులో తనకు తెలిసినవి అవలంభించి గెలుపును సొంతం చేసుకుంటాడు. ఓటమిలో తనకు తెలియనివి ఎన్నో నేర్చుకుంటాడు. మన చుట్టూ ఉన్న మనుషుల నుంచే కాదు, జంతువుల నుంచి కూడా ఎన్నో నేర్చుకోవచ్చని చాణుక్యుడు చెప్పాడు. ఆరు జంతువుల నుంచి ఈ ఆరు లక్షణాలు నేర్చుకుంటే సక్సెస్ గ్యారెంటీగా సాధించవచ్చని చెప్పాడు. అవేమిటో చూదాం…
సింహం: కటినమైన పనిని సాధించడం.
ఎంతటి కష్టమైనా చెయ్యలేమని నిరాశపడకండి. ఎంత ఖష్టమైన పనినైనా సరే.. మనకి తెలిసిన పని అయితే సింహంలా సాధించండి.
కొంగ: ఇంద్రియ నిగ్రహం, కార్య సాధన
నిగ్రహం అనేది చాలా అవసరం. సాధన చెయ్యనిదే దేన్నీ సాధించలేము.
కోడి: సకాలంలో మేల్కొనడం, కలబడి ఆహారం సాధించడం, పోరాట పటిమ.
టైం డిసిప్లెన్ అనేది కోడి నుంచి నేర్చుకోవచ్చు. పోరాడి మరీ మనకు కావాల్సింది సాధించాలి. మనకి ఉన్నదానిలోనే ఎదుటివారికి మర్యాద చెయ్యాలి.
గాడిద: అలసినా బరువు మోయడం. ఎండా వాన భరించడం. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం.
అలసిపోతున్నామని భాద్యతలను వదలొద్దు. ఎండగా ఉందని, వానగా ఉందని దేనికీ బద్దగించి పనులు ఆపొద్దు. ఎన్ని భాద్యతలను మోస్తుంటే మనం అంత సక్సెస్ ఫుల్ లైఫ్ అని ఆనందంగా ఉండాలి.
కాకి: ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండడం, నిరంతర వస్తు సేకరణ, ఇతరులను నమ్మకపోవడం.
ఏపని చేస్తున్నా ఎల్లప్పుడూ జాగ్రతగా ఉండాలి. ఎప్పుడు ఎదో ఒక విషయాన్ని సేకరిస్తూ ఉండాలి ఆ నాలెడ్జ్ మనకి చాలా ఉపయోగపడతుంది. ఇతరులను నమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కుక్క: దొరికిన ఆహారంతో సంతృప్తి పడటం, నిద్రించే వేళలో కూడా జాగ్రత్తగా ఉండటం, యజమానిపై విశ్వాసం.
మనకి ఉన్న దాంతోనే కాదు, మనకి దొరికిన దాంతో అంటే కష్టపడి సంపాదించిన దాంతో తృప్తి చెందాలి. నిద్రలో కూడా ఎదుటివాడిని డిఫెన్స్ ఎలా చేయాలో అన్నంత జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసం ఉంటే అది నీ విలువను పెంచుతుంది. నువ్వు మోసగాడివి అనే పేరుతో సంపాదించే దాని కంటే, విశ్వాసం ఉన్న వ్యక్తి గా కార్య సాధన చేస్తే ఇంకా ఎక్కువగానే సంపాదిస్తావు.
Loading...

Popular Posts