ఈ 6 పధార్ధాలతో చాలా తక్కువ సమయంలోనే మీ చర్మం మెరిసిపోతుంది

Loading...
వయసు పెరుగుతున్నా చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపించాలని కోరుకోని వారు ఉండరు. అందుకోసం ఖరీదైన క్రీంలపై పెట్టుబడి పెట్టేకన్నా.. మీకు అందుబాటులో ఉండే పండ్లూ, కొన్ని పదార్థాలతో ఈ పానీయాలు చేసుకుని తాగి చూడండి. చాలా తక్కువ సమయంలోనే మీ చర్మంలో మార్పు కనిపిస్తుంది.
బొప్పాయి: ఈ పండు మొటిమల్ని నివారించడంతోపాటూ మృతకణాలనూ తొలగిస్తుంది. ఇందులో ఔషధగుణాలే కాదు, యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. ఇందులో ఉండే పపైన్‌ అనే ఎంజైము చాలా తక్కువ సమయంలోనే చర్మానికి మెరుపును తెస్తుంది. ఒకవేళ ఆ రుచి నచ్చకపోతే కొన్ని పుచ్చకాయ ముక్కలు లేదా స్ట్రాబెర్రీలు వేసుకోండి.
అల్లం: ఇందులో మెగ్నీషియం, పొటాషియంతోపాటూ యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. అల్లం చర్మానికే కాదు, జుట్టుకీ మేలుచేస్తుంది. మీకు పొద్దున్నే తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు తాగే అలవాటు ఉంటే.. అందులో కొద్దిగా అల్లం తరుగూ వేసుకోండి. అయితే అది కొద్దిగా ఘాటుగా ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి పుదీనా లేదా తులసి ఆకుల్ని వేసుకోండి.
టొమాటో: అప్పుడప్పుడూ టొమాటో కెచెప్‌ తినడం, సూప్‌ తీసుకోవడం ఒక్కటే కాదు కుదిరినప్పుడల్లా ఆ రసం కూడా తాగేందుకు ప్రయత్నించండి. పొద్దున్నే తీసుకునే అల్పాహారంతోపాటూ గ్లాసు టొమాటోరసం కూడా తాగడం వల్ల చర్మం బాగుండటమే కాదు, ముడతలూ తగ్గుతాయి. పైగా చర్మం రోజంతా తాజాగా కనిపిస్తుంది. అయితే అందులో కొద్దిగా నిమ్మరసం,. ఉప్పు, మిరియాలపొడి వేసుకుంటే బాగుంటుంది.
బీట్‌రూట్‌: అప్పటికప్పుడు విటమిన్‌ సి తోపాటూ పొటాషియంని అందించే గుణం బీట్‌రూట్‌ ప్రత్యేకత. ఇది శరీరాన్ని శుభ్రం చేయడమే కాదు.. చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగానూ ఉంచుతుంది. కేవలం బీట్‌రూట్‌రసం తాగడం కష్టం కాబట్టి దానిమ్మ, యాపిల్‌, క్యారెట్‌ వంటివీ ఇందులో కలపండి.
నిమ్మరసం: ఇది చర్మంలోని పీహెచ్‌ స్థాయుల్ని సమతూకంలో ఉంచుతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. అయితే దీని తయారీలో చక్కెరకు బదులు తేనె వాడితే మరీ మంచిది. ఈ రసం సహజ క్లెన్సర్‌లా పనిచేస్తుంది.
క్యారెట్‌: మొటిమల తాలూకు మచ్చలు, పిగ్మెంటేషన్‌ సమస్యతో బాధపడుతున్నారా.. కొన్నాళ్లపాటు రోజూ క్యారెట్‌రసం తాగేలా చూసుకోండి. ఆ సమస్యలు తగ్గి, చర్మం మెరవడమే కాదు.. జుట్టూ, పళ్లూ, గోళ్లు, కణజాలం కూడా బాగుంటాయి.
Loading...

Popular Posts